ప్రేమపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

ప్రేమపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

ఇద్ద‌రి మ‌ధ్య చిగురించే ప్రేమ వ్య‌వ‌హారం.. ఇది పూర్తిగా ఆ ఇద్ద‌రువ్య‌క్తుల వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు సంబంధించిందే త‌ప్పించి మ‌రొక‌టి కాదు. తాజాగా అదే విష‌యాన్ని మ‌రోసారి గుర్తు చేసింది కేర‌ళ హైకోర్టు. ల‌వ్ మీద మ‌రే రాష్ట్ర హైకోర్టు ఇవ్వ‌ని కోణంలో సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది కేర‌ళ హైకోర్టు.

ఇద్ద‌రు యువతీయువ‌కులు ప్రేమించుకున్నార‌న్న‌కార‌ణంతో వారిని కాలేజీ నుంచి తొల‌గించిన వైనంపై హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఏ కాలేజీలో కూడా ప్రేమ వ్య‌వ‌హారం పేరుతో విద్యార్థుల్ని తొల‌గించే హ‌క్కు విద్యా సంస్థ‌ల‌కు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. తివేండ్రంలోని ఒక కాలేజీలో చ‌దువుతున్న మాళ‌విక‌.. అదే కాలేజీలో చ‌దువుతున్న వైశాఖ్ ను ప్రేమించింది. వారి ప్రేమ‌పై త‌ల్లిదండ్రులు అభ్యంత‌రం చెప్పారు. అనంత‌రం చోటు చేసుకున్న  ప‌రిణామాల నేప‌థ్యంలో కాలేజీ ప్ర‌తిష్ఠ‌కు భంగం వాటిల్లింద‌న్న పేరుతో వారిని కాలేజీ నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 

దీనిపై ప్రేమికుల త‌ర‌ఫున న్యాయ‌వాది శ్యామ్ జె శామ్ కోర్టును ఆశ్ర‌యించారు. దీని నేప‌థ్యంలో జ‌రిగిన వాదోప‌వాదాల‌కు తెర దించుతూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇస్తూ.. ప్రేమికుల‌కు ఊర‌ట‌నిచ్చింది. ప్రేమ అన్న‌ది మాన‌వ ప్ర‌వృత్తి అని.. ప్ర‌కృతి స‌హ‌జ‌సిద్ధ‌మైన ఈ విష‌యాన్ని అడ్డుకోవ‌టం స‌రికాద‌ని పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు