భ‌ర్త స్వ‌ప్నం సాకారం కోసం కూలీ అయిన మంత్రి!

భ‌ర్త స్వ‌ప్నం సాకారం కోసం కూలీ అయిన మంత్రి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుప‌రిచిత‌మైన రాజ‌కీయ కుటుంబాల్లో ప‌రిటాల ఫ్యామిలీ ఒక‌టి. ప్రాంతానికి సంబంధం లేకుండా వీరి వ్య‌క్తిగ‌త చ‌రిష్మా రెండు రాష్ట్రాల్లో క‌నిపిస్తూ ఉంటుంది. దివంగ‌త ప‌రిటాల ర‌వి రాజ‌కీయ వార‌సురాలిగా ఆయ‌న స‌తీమ‌ని ప‌రిటాల సునీత ప్ర‌స్తుతం ఏపీ మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మిగిలిన మంత్రుల‌కు ప‌రిటాల సునీత‌కు వ్య‌త్యాసం ఉంది. ఆమె వ్య‌వ‌సాయ ప‌నుల్ని ఇప్ప‌టికి చేస్తుంటారు. మంత్రి అన్న ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించ‌రు. అంద‌రిలోనూ క‌లిసిపోయే తత్త్వం ఉన్న ఆమె తాజాగా వ్య‌వ‌హ‌రించిన తీరు ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న భ‌ర్త ప‌రిటాల ర‌వి చిర‌కాల స్వ‌ప్న‌మైన పేరూరు డ్యాం ప‌నుల్లో తాజాగా మ‌మేకం అయ్యారు. త్వ‌ర‌లోనే అనంత‌పురం జిల్లా రామ‌గిరి మండ‌లం పేరూరు డ్యాం కాలువ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసేందుకు సీఎం చంద్ర‌బాబు జిల్లాకు రానున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ పైలాన్ ప‌నులు చేస్తున్నారు.

త‌న భ‌ర్త క‌ల నిజం కానున్న ఆనందంతో ఉన్న మంత్రి సునీత‌.. పైలాన్ ప‌నుల్లోకూలీగా అవ‌తారం ఎత్తారు. కూలీగా పని చేసి.. త‌న భ‌ర్త క‌ల‌ను సాకారం చేయ‌టమే త‌న ల‌క్ష్య‌మ‌న్న విష‌యాన్ని తెలియ‌జేసేలా వ్య‌వ‌హ‌రించారు. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను స‌మీక్షించ‌ట‌మే కాదు.. కూలీల‌తో క‌లిసి తానూ ప‌ని చేయ‌టం విశేషం. హోదా.. ద‌ర్పాన్ని ప‌క్క‌న పెట్టేసి.. క‌లివిగా వ్య‌వ‌హ‌రించిన ఆమె తీరు అంద‌రి దృష్టిని ఆక‌ట్టుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English