రాజ‌ధానిలో ప‌వ‌న్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన రైతులు

రాజ‌ధానిలో ప‌వ‌న్ కు దిమ్మ తిరిగే షాకిచ్చిన రైతులు

జ‌న‌సేన అధినేత‌కు రైతులు షాకిచ్చారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఉండ‌వ‌ల్లిలో రైతులతో స‌మావేశ‌మైన ప‌వ‌న్ మాట్లాడుతూ.. అన్న‌దాత‌ల అభిమ‌తానికి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం భూసేక‌ర‌ణ చేప‌డితే ఊరుకునేది లేద‌ని.. పోలీసు తూటాల‌కు సైతం తాను ఎదురు నిల‌బ‌డ‌తాన‌ని భారీ డైలాగులు చెప్ప‌టం తెలిసిందే.

ఆయ‌న మాట్లాడిన వేదిక‌కు కాస్త దూరంలో ఉండే తూళ్లురు గ్రామానికి చెందిన రైతు నాయ‌కులు ప‌వ‌న్ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. రాజ‌ధాని ప్రాంతంలో రైతుల్ని ఎవ‌రూ బ‌ల‌వంతం చేయ‌లేద‌ని.. రైతులు ఇష్ట‌ప‌డి 33 వేల ఎక‌రాల భూమిని రాజ‌ధాని నిర్మాణం కోసం స్వ‌చ్ఛందంగా ఇచ్చిన వైనాన్ని గుర్తు చేశారు. ప‌వ‌న్ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడుతున్నార‌ని.. ఆయ‌న మ‌తి స్థిమితం కోల్పోయార‌న్నారు.

రోడ్ల‌పై స్ప‌ష్ట‌త లేదు.. భూముల కోసం బ‌ల‌ప్ర‌యోగం చేస్తే ఊరుకునేది లేదంటూ మాట్లాడ‌టానికి ఇదేమీ సినిమా కాదంటూ రైతు నాయ‌కులు స్ప‌ష్టం చేయ‌టం విశేషం. రాజ‌ధాని గురించి ప‌వ‌న్ కు ఏమీ తెలీద‌ని.. ఆయ‌న మాట‌ల్ని చూస్తే ఆ విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెబుతున్నారు.

అంతేకాదు.. హైద‌రాబాద్‌లో సినిమాలు తీసుకునే ప‌వ‌న్ రాజ‌ధాని నిర్మాణం కోసం బాబు చేస్తున్న కృషి ఏమైనా తెలుసా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఓవైపు అమ‌రావ‌తిలో అభివృద్ధి జ‌రుగుతుంటే.. మ‌రోవైపు గ‌జిబిజి చేసి రైతుల ఫ్లాట్ల‌కు విలువ త‌గ్గేలా చేస్తున్న‌ది ఎవ‌రు? అంటూ ప‌వ‌న్ ను ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు.. ఈ తీరును మార్చుకోక‌పోతే రైతుల ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దంటున్నారు.

ఈ మొత్తం ఉదంతాన్ని చూస్తే.. ప‌వ‌న్ కు స‌ల‌హాలు ఇచ్చే బ్యాచ్ ను ఆయ‌న త్వ‌ర‌గా మార్చుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌తంలోనూ అమ‌రావ‌తి భూముల విష‌యంలో జ‌గ‌న్ జోక్యం చేసుకున్నారు. భూముల సేక‌ర‌ణ విష‌యంలో లొల్లి పెట్ట‌టం ద్వారా రాజ‌కీయ ల‌బ్థి పొందొచ్చ‌న్న ఆలోచ‌న చేశారు. అయితే.. అది రివ‌ర్స్ లో త‌న‌కే న‌ష్టం వాటిల్లుతుంద‌న్న విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన ఆయ‌న వెంట‌నే త‌న రూట్ మార్చేశారు.

అమ‌రావ‌తి భూముల విష‌యంపై మాట్లాడ‌టం మానేశారు. ఈ చిన్న విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించ‌లేదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. భూసేక‌ర‌ణ విష‌యంలో ప‌వ‌న్ గ‌తంలోనూ ఒక‌సారి ఎంట్రీ ఇవ్వ‌టం.. రెండు.. మూడు ప్రాంతాల్లో ప‌ర్య‌టించ‌టం తెలిసిందే.

ఆ సంద‌ర్భంగా ఆయ‌న‌కు భిన్న‌మైన రిపోర్టులు రావ‌టం.. ఆ స‌మ‌యంలో ఆయ‌న స‌న్నిహితులు అమ‌రావ‌తి భూముల విష‌యంలో జోక్యం చేసుకోవ‌టంతో లేని పోని వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌న్న అభిప్రాయంతో వెన‌క్కి తగ్గారు. కానీ.. ఇప్పుడేమో ప్ర‌తి విష‌యంలోనూ ఏదోలా కెల‌కాల‌న్న‌ట్లుగా పవ‌న్ తీరు ఉంద‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్న వేళ‌.. అమ‌రావ‌తి భూముల విష‌యంలో ఊహించ‌ని రీతిలో రైతుల ఆగ్ర‌హాన్ని చ‌వి చూశార‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English