హోదాతో జాక్‌పాట్ పై క‌న్ను!

హోదాతో జాక్‌పాట్ పై క‌న్ను!

పోగొట్టుకున్న చోటే వెత్తుకోవాలి అన్నారు పెద్దలు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే పని చేస్తోంది. రాష్ట్రాన్ని రెండుగా విభజించిన పాపాన్ని హోదాతో కడిగేసుకోవాలనుకుంటోంది. ఇందుకోసం ఇతర రాష్ట్రాలను కూడా ప‌క్కన పెట్టాలనుకుంటోంది. ఆదివారం జరిగిన సిడబ్లుసీ సమావేశంలో  ఆంధ్రప్రదేశ్‌కు హోదా పైనే సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికాంలోకి రాగానే తొట్టతొలి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పైనే చేయాలని తీర్మానం చేసింది.

ప్రత్యేక హోదాను తమకూ ఇవ్వలని పట్టుబట్టిన ఒడిషా, బీహార్ రాష్ట్రాల పీసీసీలపై కన్నెర్ర చేసింది.  " ప్రత్యేక హోదా ఒక్క ఆంధ్రప్రదేశ్‌‌కే మిగిలిన ఏ రాష్ట్రాలూ దీని కోసం పట్టుబట్టకూడదు" అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హుకుం జారీ చేశారు. దీంతో ప్రత్యేక హోదా కోరుకుంటున్నా పలు రాష్ట్రాల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలు హతాశులయ్యారు.

వచ్చే ‍‍‍యాభై ఏళ్ల వరకూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారం లోకి రాలేమని తెలుసుకున్న కాంగ్రెస్ పెద్దలు ఈ ఎన్నికల నుంచే దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ వీడిన పార్టీ పెద్దలందరిని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావడం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదాను ఇచ్చేది లేదని బిజెపి ప్రకటించడంతో ఆ పని తామే చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై ఉన్నది.

దీనికి ప్రత్యేక హోదా ఒక్కటే సరైన చికిత్స అని  అధిష్టానం భావిస్తోంది. ప్రత్యేక హోదా తామే ఇస్తామని గ్రామ వార్డుల స్థాయిలో ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని రాబోయే ఎన్నికలలో తమకు విజయం ఖాయమని కాంగ్రెస్ నాయకులు నమ్ముతున్నారు. ఈ ఎన్నికలలోఆంధ్రప్రదేశ్‌లో గెలువలేకపోయిన అధికారంలోకి వస్తే మాత్రం హోదా ఇవ్వలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ సారి ఇలా చేస్తే వచ్చే ఎన్నికలలో తమకు తిరుగుండదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు