ఎంపీ క‌విత ఛాలెంజ్ ను జ‌క్క‌న్న స్వీక‌రిస్తాడా?

ఎంపీ క‌విత ఛాలెంజ్ ను జ‌క్క‌న్న స్వీక‌రిస్తాడా?

తెలంగాణలో కేసీఆర్ స‌ర్కార్ ...`హ‌రిత హారం` కార్య‌క్రమాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యం, ప‌చ్చ‌ద‌నం కోసం కేసీఆర్ మొక్క‌లు నాటే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. శుక్ర‌వారం నాడు నాలుగో విడ‌త `హ‌రిత హారం` కార్య‌క్రమం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. `హ‌రిత హారం`తో పాటు `గ్రీన్ ఇండియా చాలెంజ్ `లో భాగంగా, తెలంగాణ సీఎంవో ఓఎస్ డీ, ఐఎఫ్ ఎస్ అధికారి ప్రియాంకా వ‌ర్ఘీస్ విసిరిన `గ్రీన్ ఇండియా ఛాలెంజ్`ను ఎంపీ కల్వకుంట్ల కవిత స్వీక‌రించారు. మొక్క‌నాటుతూ దిగిన సెల్ఫీని క‌విత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హరిత ప్రపంచం కోసం తన వంతు కృషి చేస్తానంటూ ట్వీట్ చేశారు. మొక్కలను నాటి, ప్రపంచం మొత్తం పచ్చదనంతో పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. దాంతోపాటు, మ‌రో న‌లుగురికి క‌విత `గ్రీన్ ఇండియా ఛాలెంజ్`విసిరారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్, సినీ దర్శకుడు రాజమౌళికి క‌విత `గ్రీన్ ఇండియా ఛాలెంజ్` విసిరారు.

కాగా, ఎంపీ కవిత ఛాలెంజ్ ని సైనా నెహ్వాల్ స్వీకరించారు. తాను మొక్కలు నాటుతూ దిగిన ఫొటోని సైనా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ పచ్చదనం- పరిశుభ్రత కోసం పాటుపడాలని సైనా  పిలుపునిచ్చారు. దాంతోపాటు, తాప్సీ, శ్రద్ధా కపూర్, ఈషాగుప్తాల‌ను `గ్రీన్ ఇండియా ఛాలెంజ్`కు నామినేట్ చేసిన‌ట్లు  ట్వీట్ చేశారు. తనను నామినేట్ చేసినందుకు ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మాజీ రాష్ట్ర‌ప‌తి, దివంగ‌త‌ అబ్దుల్ క‌లాంకు ప‌ర్యావ‌ర‌ణం, ప‌చ్చ‌ద‌నంపై శ్ర‌ద్ధ ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యంగా క‌లాం చేతుల మీదుగా ఎన్నో మొక్క‌లు నాటారు. ఈ నెల 27న జ‌ర‌గ‌నున్న క‌లాం వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పిస్తూ ఇగ్నైటింగ్ మైండ్స్ అనే స్వ‌చ్ఛంద సంస్థ `గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ` కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. ఆ కార్య‌క్రమానికి తెలంగాణ ప్ర‌భుత్వం ...`హ‌రిత హారం`ద్వారా మ‌ద్ద‌తు తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు