శర్వా.. వెయిటింగ్ ఇక్కడ

శర్వా.. వెయిటింగ్ ఇక్కడ

యంగ్ హీరో శర్వానంద్ టాలీవుడ్ దర్శకులకు హాట్ ఫేవరెట్ గా మారిపోయాడు.  కామెడీ మిక్స్ డ్ ఎంటర్ టెయినర్లు చేయాలన్నా.. అటు నటనకు స్కోప్ ఉన్న స్టోరీలైనా వాటికి సమన్యాయం చేయగల సత్తా ఇతడికుంది. దీనికితోడు శర్వానంద్ సినిమా అంటే ఆడియన్స్ లో ఓ పాజిటివ్  ఒపీనియన్ ఉంది. అందుకే అతడి సినిమా అంటే మినిమం గ్యారంటీ.

దీంతో శర్వానంద్ తో సినిమా తీయాలని డైరెక్టర్లు తెగ ఆరాట పడిపోతున్నారు. ప్రస్తుతం అతడికి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు.. స్టోరీ చెప్పి అతడు ఎప్పుడెప్పుడు ఎస్ అంటాడా అని ఎదురుచూస్తున్న వారు దాదాపు అర డజను మంది వరకు ఉన్నారు. ఈ రేంజిలో డైరెక్టర్లు స్టోరీతో సహా రెడీగా ఉన్నది శర్వా ఒక్కడి కోసమే. సూపర్ స్టార్ మహేష్ తో బ్రహ్మోత్సవం సినిమా తీసి డీలాపడ్డ శ్రీకాంత్ తిరిగి తన సత్తా చూపించుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు శర్వానంద్ బాగా సూటవుతాడని అతడిని కలిసి కథ కూడా వినిపించాడు.

తాజాగా సమ్మోహనంతో హిట్  కొట్టిన డైరెక్టర్ ఇంద్ర గంటి మోహన కృష్ణ శర్వాతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడు. శ్రీనివాసరాజు మరో ఇధ్దరు యంగ్ డైరెక్టర్లు కూడా అతడి డేట్ల కోసం వెయింటింగ్ లో ఉన్నారు. ప్రస్తుతం శర్వానంద్ హను రాఘవపూడి డైరెక్షన్ లో పడిపడి లేచే మనసు సినిమా చేస్తున్నాడు. ఇందులో ఫిదా బ్యూటీ సాయి పల్లవి  హీరోయిన్. ఇదికాక సుధీర్ వర్మ డైరెక్షన్ లోనూ ఓ సినిమా షూటింగ్ లో ఉంది. ఈ రెండూ పూర్తయ్యాకే ఏ సినిమా ఓకే చేసేది చెబుతానని శర్వానంద్ అంటున్నాడట. మరీ అంతకాలమంటే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోయేలా ఉంది శర్వా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు