120 మందిపై అత్యాచారం..వీడియోలు తీశాడు

120 మందిపై అత్యాచారం..వీడియోలు తీశాడు

భక్తి ముసుగులో ఆధ్యాత్మిక కేంద్రాలు అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. భక్తితో, మానసిక ప్రశాంతత కోసం వచ్చే మహిళలపై  కొంతమంది దొంగ బాబాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇలా మరో డేరాబాబా వెలుగులోకి వ‌చ్చాడు. హర్యానాలోనే మరో ఫేక్ బాబా బాగోతం బయటపడింది. ఫతేబాద్ జిల్లాలోని తొహనా సిటీలోని బాబా బలక్ నాథ్ టెంపుల్ మహంత్.. బాబా అరంపురి అమ్మాయిలను బలవంతంగా రేప్ చేపిన వీడియోలు బయటకు వచ్చాయి. తన దగ్గరకు వచ్చే భక్తులను భయపెట్టి.. వారిపై బాబా అరంపురి రేప్ చేశాడు. బాబా బాగోతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పోలీసులు విచారణ ప్రారంభించగా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

హర్యానలోని ఫతేబాద్ తోహనా పట్టణానికి చెందిన అరవై ఏళ్ల బాబా అమరపురి ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. అంతటితో అగకుండా వారందరి వీడియోలు చిత్రికరించడం సంచలనం రేపుతుంది. అత్యాచారం చేసిన దృశ్యాలను బాబా తన మొబైల్ ఫోన్ తో రికార్డు చేసుకున్నాడు. ఆ వీడియో క్లిప్‌లు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ వారిపై పలు సార్లు అత్యాచారం చేశాడని దర్యాప్తులో తేలింది. 120 మంది మహిళల వీడియో క్లిప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బాబాకు బంధువైన ఓ వ్యక్తి ఓ సీడీని తీసుకెళ్లి పోలీసులకు అందజేశాడు. అతడి అరాచకాలు మొత్తాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ సీడీని పోలీసులు పరిశీలించగా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 120 క్లిప్‌లు బయటపడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు బాబా అమరపురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

అత్యాచారం, వీడియో చిత్రీకరణ, బెదిరింపు కేసుల్లో నిందితుడైన బాబాపై పోలీసులు వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బాబా రేప్ చేసిన బాధితుల్లో ఇద్దరు మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాబా అరంపురిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామ‌ని పోలీసులు పేర్కొన్నారు. అతడి ఇంటిపై దాడులు చేశామ‌ని, బాబా ఇంట్లోని అనుమానాస్ప‌ద వస్తువులను సీజ్ చేశామ‌ని పోలీసులు వెల్ల‌డించారు. చాలా మంది అమ్మాయిలను ఇప్పటికే బలవంతం చేశాడని.. బాధితుల నుంచి వివరాలు కూడా సేకరించామ‌ని పోలీసులు ప్రకటించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు