మోడీపై రాహుల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

మోడీపై రాహుల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

మోడీ స‌ర్కారుపై ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ అనుకున్న‌ట్లే ఆస‌క్తిక‌రంగా మారింది. అవిశ్వాసంపై తీర్పు ఏమిట‌న్న విష‌యం ఎవ‌రికి ఎలాంటి సందేహాలు లేకున్నా.. చ‌ర్చ సంద‌ర్భంగా మోడీ స‌ర్కారుపైనా.. ప్ర‌ధాని మోడీపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేసేందుకు ఇదో చ‌క్క‌టి వేదిక‌గా భావించారు. దీనికి తగ్గ‌ట్లే చ‌ర్చ సాగుతోంది. చ‌ర్చ‌ను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌.. మోడీ స‌ర్కారుపైనా.. ప్ర‌ధాని మోడీపైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి తీర‌ని ద్రోహం చేశారంటూనే.. ఇప్ప‌టికైనా న్యాయం చేయాల‌ని కోరారు.

ఇదిలా ఉంటే.. గ‌ల్లా అనంత‌రం మాట్లాడిన బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభ‌జ‌న చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు క‌లిపి.. ఆ పార్టీ శాప‌గ్ర‌స్థ‌మైంద‌న్నారు. శాప‌గ్ర‌స్థురాలైన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు గ‌డ‌ప‌టం ద్వారా.. టీడీపీ కూడా శాప‌గ్ర‌స్థ‌మైంద‌న్నారు.గ‌ల్లా ప్ర‌సంగం వింటే.. అవిశ్వాస తీర్మానం అవ‌స‌రం లేద‌నిపిస్తోంది. మోడీ పాల‌న‌లో ప్ర‌తి పేద‌వాడి ముఖం వెలిగిపోతుంద‌న్నారు.

అంత‌ర్జాతీయంగా భార‌త్ పేరు ప్ర‌తిష్ఠ‌లు వెలిగిపోతున్నారంటూ మోడీ స‌ర్కారు గొప్ప‌త‌నాన్ని చెప్పుకొచ్చారు. అనంత‌రం మాట్లాడిన కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. క్లీన్ షేవ్ తో స‌భ‌కు వ‌చ్చిన ఆయ‌న మోడీ తీరును తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌ధాని మాట‌కు విలువ ఉండాల‌ని గ‌ల్లా ప్ర‌సంగాన్ని తాను విన్నాన‌ని.. 21వ శ‌తాబ్దంలో అతిపెద్ద రాజ‌కీయ బాధితురాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

జీఎస్టీ తాము తెస్తామంటే వ‌ద్ద‌న్న బీజేపీ.. ఐదు శ్లాబుల్లో తీసుకొచ్చార‌న్నారు. దేశానికి సేవ‌కుడిగా ఉంటాన‌న్న మోడీ.. పేద‌ల ప‌ట్ల చిన్న‌చూపు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్నారు. మోడీ క‌ళ్ల‌కు వ్యాపార‌వేత్త‌లే క‌నిపిస్తార‌ని.. వారికి ల‌బ్థి చేకూరేలా నిర్ణ‌యాలు తీసుకుంటార‌న్నారు.

అందులో భాగంగానే నోట్ల ర‌ద్దుగా చెప్పిన ఆయ‌న‌.. త‌న క‌ళ్ల‌ల్లోకి చూసి కూడా మాట్లాడ‌లేని స్థితిలో మోడీ ఉన్నార‌న్నారు. దీనికిప్ర‌తిగా మోడీ న‌వ్వుతూ ఉండ‌టం క‌నిపించింది. గ‌ల్లా జ‌య‌దేవ్ విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు గంభీరంగా ఉన్న మోడీ.. రాహుల్ ప్ర‌సంగం సంద‌ర్భంగా అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు త‌న హావ‌భావాల్ని మార్చుకోవ‌టం క‌నిపించింది.

ప్ర‌ధాని మోడీ అవినీతికి వ్య‌తిరేకంగా చాలానే మాట‌లు మాట్లాడ‌తార‌ని.. కానీ అమిత్ షా కుమారుడి ఆస్తి అంత భారీగా ఎలా పెరిగింద‌న్న విష‌యాన్ని ప‌ట్టించుకోర‌న్నారు. విమానాల కొనుగోలు విష‌యంలో మ‌త‌ల‌బు ఉంద‌న్న ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో మోడీతో పాటు వ్యాపార‌వేత్త ఉండ‌టాన్ని ప్ర‌స్తావించారు. తానుఫ్రాన్స్ అధ్య‌క్షుడ్ని క‌లిశాన‌ని చెప్పిన రాహుల్ వ్యాఖ్య‌లు స‌భ‌లో పెను దుమారాన్ని రేపాయి. ర‌ఫెల్ డీల్ పై రాహుల్ చేసిన ఆరోప‌ణ‌లపై బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో.. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

దీన్ని స‌ర్ది చెప్ప‌టానికి ప్ర‌య‌త్నించిన స్పీక‌ర్.. విధి లేని ప‌రిస్థితుల్లో ప‌ది నిమిషాల పాటు స‌భ‌ను వాయిదా వేశారు. అనంత‌రం స‌భ మొద‌లైంది. ర‌ఫెల్ పై రాహుల్ చేసిన ఆరోప‌న‌ల‌పై  ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ రియాక్ట్ అవుతూ.. ర‌ఫెల్ ఒప్పందం యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగింద‌ని.. ఆ స‌మ‌యంలో ర‌క్ష‌ణ‌మంత్రిగా ఏకే ఆంటోనీ ఉన్నార‌న్నారు. ఒప్పంద వివ‌రాలుబ‌య‌ట‌పెట్టొద‌నే సంప్ర‌దాయం ఉంద‌ని.. అందుకే వెల్ల‌డించ‌లేద‌న్నారు. రాహుల్ చేసిన ఆరోప‌ణ‌లు నిరాధార‌మైన‌వ‌ని చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు