అవిశ్వాసంలో ఏ పార్టీకి ఎంత టైం ఫిక్స్ చేశారంటే?

అవిశ్వాసంలో ఏ పార్టీకి ఎంత టైం ఫిక్స్ చేశారంటే?

మ‌రికాసేప‌ట్లో మోడీ స‌ర్కారుపై టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రానుంది.  తిరుగులేని బ‌లంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ స‌ర్కారుకు నాలుగేళ్ల త‌ర్వాత కానీ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనే ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ మాట‌కు వ‌స్తే.. గ‌డిచిన 15 ఏళ్ల‌లో ఏ ప్ర‌భుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న‌ది లేదు.

గ‌త పార్ల‌మెంటు స‌మావేశాల్లోనే మోడీ స‌ర్కారుపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ‌కు స్పీక‌ర్ ఆమోదించ‌క‌పోవ‌టంతో అద‌లా ఆగిపోయింది. తాజాగా స్టార్ట్ అయిన వ‌ర్షాకాల స‌మావేశాల నేప‌థ్యంలో మోడీ స‌ర్కారు పై విప‌క్ష పార్టీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. ఇలా ఇచ్చిన పార్టీల్లో టీడీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసును ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న స్పీక‌ర్ సుమిత్రా.. ఈ రోజు ప్ర‌త్యేక చ‌ర్చ‌కు డిసైడ్ చేశారు.

అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ నేప‌థ్యంలో ఏపార్టీ ఎంత‌సేపు మాట్లాడాలి?  అన్న అంశాన్ని ఫిక్స్ చేశారు. అధికార బీజేపీకి భారీ స‌మ‌యాన్ని కేటాయించారు. బీజేపీ ఏకంగా 213 నిమిషాల పాటు మాట్లాడే వీలుంది. ఇందులో అత్య‌ధిక భాగం మోడీనే మాట్లాడతార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఏపీ అధికార‌ప‌క్షం ప్ర‌వేశ పెట్టిన తీర్మానం కావ‌టంతో ఏపీకి చెందిన ఎంపీ హ‌రిబాబు చేత ప్ర‌త్యేకంగా మాట్లాడించాల‌ని బీజేపీ భావిస్తోంది.

దీనికి సంబంధించిన వివ‌రాల్ని ఇప్ప‌టికే పార్టీ ఆయ‌న‌కు అంద‌జేసింది. ఏపీ అధికార‌ప‌క్షానికి చెందిన స‌మ‌యం 13 నిమిషాలైతే.. ఎపీ బీజేపీ ఎంపీ హ‌రిబాబు చేత ఏకంగా 15 నిమిషాల పాటు మాట్లాడించాల‌ని బీజేపీ డిసైడ్ చేసింది. ఈ స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం ఏ మేర సాయం చేసింద‌న్న విష‌యంతో పాటు.. బాబు స‌ర్కారుపై దునుమాడేలా ప్లాన్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

అవిశ్వాస తీర్మానంలో ఏ పార్టీకి ఎంత స‌మ‌యాన్ని కేటాయించార‌న్న‌ది చూస్తే..

బీజేపీ                         213 నిమిషాలు
కాంగ్రెస్                        28 నిమిషాలు
అన్నాడీఎంకే               29 నిమిషాలు
తృణ‌మూల్ కాంగ్రెస్   27 నిమిషాలు
బీజేడీ                            15 నిమిషాలు
శివ‌సేన                          14 నిమిషాలు
టీడీపీ                             13 నిమిషాలు
టీఆర్ ఎస్                       9 నిమిషాలు
సీపీఎం                            7 నిమిషాలు
స‌మాజ్ వాదీ                   6 నిమిషాలు
ఎన్సీపీ                             6 నిమిషాలు

ఎల్ జే ఎస్పీ                    5 నిమిషాలు

మిగిలిన పార్టీల‌న్నింటికి రెండేసి నిమిషాల చొప్పున స‌మ‌యాన్ని కేటాయించ‌నున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు