ప‌రిపూర్ణ క‌ల‌క‌లం..కేసీఆర్‌ను కెలికిన బీజేపీ ఎంపీ

ప‌రిపూర్ణ క‌ల‌క‌లం..కేసీఆర్‌ను కెలికిన బీజేపీ ఎంపీ

ఓ వైపు ఢిల్లీ వేదిక‌గా అవిశ్వాసం హీట్ కొన‌సాగుతుంటే మ‌రోవైపు హైద‌రాబాద్ వేదిక‌గా స్వామి పరిపూర్ణానంద స‌స్పెన్ష‌న్ క‌ల‌క‌లం సాగుతోంది. ప‌రుపూర్ణానంద‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన నగర బహిష్కరణపై ఉభయ హైద‌రాబాద్‌లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ రోజంతా వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప‌లుచోట్ల ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లిగించే నిర‌స‌న‌లు జ‌రుగుతుండ‌టంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్‌లోకి బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణియన్ స్వామి సైతం ఎంట్రీ ఇచ్చారు. స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను తప్పుపడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సుబ్రమణ్య‌ స్వామి లేఖాస్త్రం సంధించారు. ఈ మేర‌కు ఓ బ‌హిరంగ లేఖ‌ను త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

స్వామి పరిపూర్ణానంద విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం తీరుని సుబ్రమణ్య స్వామి తీవ్రంగా తప్పుపట్టారు. ఆయ‌న బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధం అని లేఖలో పేర్కొన్నారు. `ఒక సాధువును గుండాలా ట్రీట్ చేస్తారా?బహిష్కరణ ఎత్తివేస్తారా? లేదంటే రంగంలోకి దిగమంటారా? ` అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వ చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)a, 19(1)(d), 19(1)(b) ప్రకారం భావప్రకటనా స్వేచ్చను హరించడమే అన్నారు. స్వామిపై బహిష్కరణ వేటు ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే చర్య అన్నారు. బహిష్కరణ నిర్ణయాన్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని.. లేదంటే న్యాయస్థానంలో మూల్యం చెల్లించుకోకతప్పదని సుబ్రమణ్య‌ స్వామి లేఖలో హెచ్చరించారు. వెంటనే స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ ఎత్తివేయాలని స్వామి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుండాలకు ఉపయోగించే సెక్షన్ ని స్వామీజీకి ఉపయోగించడం ఏంటని ప్రశ్నించారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవారిపై ఇలాంటి సెక్షన్ విధించడం ఏంటని నిలదీశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు