సోనియా, చంద్రబాబుల దెబ్బకు స్టాక్ మార్కెట్ పతనం

సోనియా, చంద్రబాబుల దెబ్బకు స్టాక్ మార్కెట్ పతనం

స్టాక్ మార్కెట్ అంటే అదేదో కంపెనీలకు సంబంధించిన వ్యవహారం కాదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరి సొమ్ము ఉండే చోటది. అక్కడ లాభాలొస్తే సామాన్యుడి ముఖం వెలిగిపోతుంది. మార్కెట్లు కుదేలైతే నష్టపోయి విలవిల్లాడుతారు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు పతనమవుతుందో.. ఎప్పుడు పైకెగస్తుందో ఎవరూ చెప్పలేరని అందరూ అంటారు కానీ.. దేశీయంగా రాజకీయ పరిస్థితుల ప్రభావం మార్కెట్లపై ఎంత ఉంటుందో తెలిసిందే. కేంద్రంలోని ప్రభుత్వ స్థిరత్వానికి ఢోకా వస్తుందంటే మార్కెట్లు కుప్పకూలుతాయి. ప్రభుత్వం స్థిరంగ ఉంటే మార్కెట్లు కులాసాగా ఉంటాయి. ఇదొక్కటే కాకుండా ఇతర కారణాలూ మార్కెట్లపై ప్రభావం చూపించినా ఇదీ కీలకాంశమే.

అలాంటిది.. ప్రభుత్వ స్థిరత్వానికి భంగం కలిగే చర్యలు జరిగినప్పుడు మార్కెట్లు పడిపోతాయి. తాజాగా ఈ రోజు లోక్ సభలో టీడీపీ, కాంగ్రెస్ లు అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల మార్కెట్లు కుప్పకూలాయి. టీడీపీ, కాంగ్రెస్ లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. కొద్దిరోజులుగా పరుగులు తీస్తున్న మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచి పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ వచ్చాయి. అయితే..  పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాసం పెట్టడం, దాన్ని చర్చకు తీసుకుంటామని స్పీకర్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడిన వెంటనే కుప్పకూలాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి.

     ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 147 పాయంట్లు పతనమై 36,373కు పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,980కి దిగజారింది. అశోక్ లేల్యాండ్ (-13.93%), హిందుస్థాన్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (-6.44%), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (-6.33%), పీసీ జువెలర్స్ (-6.02%), డెన్ నెట్ వర్క్స్ (-5.77%)   నష్టపోయాయి. మదుపర్ల సొమ్ము హారతి కర్పూరమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English