క‌ట్నం కోసం భార్య టార్చ‌ర్‌..టెకీ మైండ్ బ్లాంక్‌

క‌ట్నం కోసం భార్య టార్చ‌ర్‌..టెకీ మైండ్ బ్లాంక్‌

మీరు చ‌దివిది అక్ష‌రాల‌ నిజమే...కట్నం కోసం భార్యే చిత్రహింసలు పెడుతోంది. అదేంటి...ఎప్పుడు చూసినా కట్నం కోసం భర్త వేధింపులు.. అత్తింటి చిత్రహింసలు అంటూ వార్తలు వ‌స్తుంటాయి క‌దా? వీళ్లు మారరు అంటూ మగాళ్ల గురించి తిట్టుకుంటున్న స‌మాజంలో ఉన్న మ‌న‌కు ఇలాంటి ఘ‌ట‌న‌లు నిజంగానే సందేహం క‌లిగిస్తుంటాయి. కానీ మ‌నమంతా షాక్ అయ్యే ప‌రిణామం ఇది. ఎందుకంటే.. తాళి కట్టించుకున్న భార్య క‌ట్నం కోసం వేధిస్తోంది. అంతేనా.. రోజూ భర్తను చిత్రహింసలు పెడుతోంది. భయపెడుతోంది.. రాసిరంపాన పెడుతోంది. ఈ చిత్ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీ అనే పేరున్న బెంగ‌ళూరులో. బాధిత టెకీ తెలుగు బిడ్డ కావ‌డం గ‌మ‌నార్హం.

ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఏపీకి చెందిన ధీరజ్ రెడ్డి మంచి జీతం, హోదాలో ప‌నిచేస్తున్నాడు. భారీ లాంఛనాలతో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. మొదటి నెల హ్యాపీ.. ఆ తర్వాత భార్య అసలు రంగు బయటపడింది. డబ్బు, డబ్బు అంటూ వేధించటం మొదలుపెట్టింది. మొదట్లో భార్య కోరిక తీర్చటం కోసం అప్పులు చేసి మరీ కొనిచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ఇటీవల భార్య డైమండ్ నక్లెస్ అడిగింది. దాని విలువ రూ.30లక్షలు. దీంతోపాటుగా నాకు రెండు కోట్ల ఇవ్వాల‌ని డిమాండ్ చేసిందట‌. అయితే, అంత డబ్బు లేదని చెప్పటంతో వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు ఇస్తావా.. కట్నం వేధింపుల కింద కేసు పెట్టమంటావా అంటూ టార్చర్ పెట్టటం మొదలుపెట్టింది. తనకు తానుగా వాతలు పెట్టుకుని.. చిత్రహింసలు పెడుతున్నావ్ అంటూ కంప్లయింట్ చేస్తానని బెదిరించటం మొదలుపెట్టింది. ఇక్క‌డితోనే షాకుల ప‌రంప‌ర ఆగిపోలేదు. మా చెల్లి పెళ్లి కోసం రూ.40లక్షలు ఇవ్వాలంటూ చేయి చేసుకునే స్థాయికి వెళ్లింది. అంతేనా.. నిన్ను చంపేస్తా.. ఆ తర్వాత ఆస్తి మొత్తం నాకే కదా అంటూ వార్నింగ్స్  కూడా ఇస్తోందట‌.

కట్నం వేధింపులు భరించలేని ధీరజ్ రెడ్డి.. బెంగళూరులోని మహాదేవపురం పోలీసులకు భార్యపై కంప్లయింట్ చేశాడు. అయితే, ధీరజ్ రెడ్డి కంప్లయింట్ పై మొదట పోలీసులు సైతం షాక్ అయ్యారు. అయితే, పోలీసులకు ధీర‌జ్ ఆశ్చ‌ర్య‌పోయే విష‌యాలు చెప్పుకొచ్చాడు. త‌నను డ‌బ్బులు ఇవ్వాల‌ని బెదిరించేద‌ని, సిగ‌రెట్లు తాగ‌డం, మ‌ద్యం సేవించ‌డం వంటివి చేస్తున్న తీరును చూసి త‌ను షాక్‌కు గురై అత్త‌మామ‌ల‌కు చెప్పుకోగా...వాళ్లు సైతం త‌న భార్య‌ను బెదిరించార‌ని..దీంతో త‌ను షాక్‌కు గుర‌య్యాన‌ని ఆయ‌న పోలీసుల వ‌ద్ద వాపోయాడు. అతను చెబుతున్న విధానం, చూపించిన సాక్ష్యాలు చూసి పోలీసులు భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని ఆరుగురికి నోటీసులు ఇచ్చారు. అదండి తెలుగు టెకీకి ఎదురైన భార్య క‌ట్నం వేధింపుల స్టోరీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు