చంద్ర‌బాబుతో ఉండ‌వ‌ల్లి... గంట సేపు మీటింగ్‌!

చంద్ర‌బాబుతో ఉండ‌వ‌ల్లి... గంట సేపు మీటింగ్‌!

ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. 2014 వ‌ర‌కు క‌ర‌డు గ‌ట్టిన కాంగ్రెస్ వాది. కాంగ్ గాంధీ ఫ్యామిలీ విధేయుడు. అరుదైన ప‌రిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీ మాయం కావ‌డంతో ఇంకో పార్టీలో చేర‌లేక అలా మిగిలిపోయారు. ఏ పార్టీలో చేర‌దామ‌న్నా ఏదో ఒక యాంగిల్‌లో అది రివ‌ర్స‌వుతుంది. ఎందుకంటే... ఉండ‌వ‌ల్లి ఇత‌ర కాంగ్రెస్ పొలిటీషియ‌న్ల‌తో పోలిస్తే కొంచెం డిఫ‌రెంట్‌. ఆయ‌న తాజాగా ఈరోజు ఏపీ సీఎం చంద్ర‌బాబును స‌చివాల‌యంలో క‌లిశారు. అనంత‌రం ఆయ‌నను మీడియా ప‌ల‌క‌రించగా త‌న దైన శైలి కామెంట్లు చేశారు.

 చంద్ర‌బాబును క‌లిశారు... టీడీపీలో చేరుతున్నారా? ఏంటి? అని అడ‌గ్గా... నేను ఏ పార్టీలో లేను, ఏ పార్టీలో చేర‌ను. గ‌తంలో ఎన్నోసార్లు చంద్ర‌బాబుపై ప‌లు రాజ‌కీయ విమ‌ర్శలు చేసిన ఉండ‌వ‌ల్లి స‌డెన్‌గా సీఎంను క‌ల‌వ‌డంతో రాజ‌కీయ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అయితే, దీనిపై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. నేను ఒక మాజీ ఎంపీని. ఏ పార్టీలో లేను అంటూ... గ‌తంలో విభ‌జ‌న‌కు సంబంధించి నేను రాసిన లేఖ‌పై ముఖ్య‌మంత్రి పిలిపిస్తే వ‌చ్చాను అంతే అని స్ప‌స్టం చేశారు.

అయితే, ఇద్దరూ గంట‌కు పైగా క‌లిసి చ‌ర్చించ‌డంతో అనేక రాజ‌కీయంగా అనేక ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఉండ‌వ‌ల్లి వాట‌న్నింటినీ కొట్టిపారేశారు. *ఇది చాలా సాధార‌ణ స‌మావేశం. గ‌తంలో మోడీ... విభజన బిల్లును తలుపులు మూసి ఆమోదించారని, ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్యను ఆధారం చేసుకుని ప్రధాని వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని పార్లమెంట్‌లో చర్చకు నోటీసు ఇవ్వాలని చంద్రబాబుకు చెప్పానని* వివ‌రించారు.  పార్లమెంటులో దీనిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సూచించాన‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.  విభజన బిల్లు ఆమోదించిన తీరు  చట్ట విరుద్ధం అన్నారు. కాబ‌ట్టి దానిపై స్వ‌ల్ప కాలిక చర్చకు నోటీసు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు వివ‌రించారు.  విభ‌జ‌న తీరుపై తాను ర‌చించిన  పుస్తకాన్ని చంద్రబాబుకు అందజేసిన‌ట్లు చెప్పారు.

ఈ సందర్భంగా వైసీపీపై ఆయ‌న ఒక ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు.  వైకాపా ఎంపీల రాజీనామాలు సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు