హైద‌రాబాద్ కాంగ్రెస్ లో అజ్జూ మంట‌లు

హైద‌రాబాద్ కాంగ్రెస్ లో అజ్జూ మంట‌లు

ఎప్పుడూ లేని రీతిలో ప్ర‌ముఖ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దీన్ కు సికింద్రాబాద్ పైన మ‌న‌సైంది. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ.. విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ రాజ‌కీయాలు చేసేందుకు ఏ మాత్రం ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించిన అజ్జూ.. తాజాగా మాత్రం తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ లోక్ స‌భ స్థానానికి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే. పార్టీ కానీ ఓకే అంటే.. తాను సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయ‌టానికి సిద్ధ‌మంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు.

అజ్జూ వ్యాఖ్య‌లు హైద‌రాబాద్ న‌గ‌ర కాంగ్రెస్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. ఈ రోజు నిర్వ‌హించిన హైద‌రాబాద్‌న‌గ‌ర క‌మిటీ స‌మావేశానికి పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. దాదాపు మూడు వేల వ‌ర‌కూ పాల్గొన్న ఈ స‌మావేశంలో అంజ‌న్ కుమార్ కు అనుకూలంగా నినాదాలు వెలువ‌డ్డాయి. తాను సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని వ‌దులుకునేది లేద‌ని అంజ‌న్ స్ప‌ష్టం చేశారు. అజ‌హ‌ర్ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు.

అజ‌హ‌రుద్దీన్ కు ద‌మ్ముంటే హైద‌రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాల‌ని అంజ‌న్ స‌వాల్ విసిరారు. ఇదిలా ఉండ‌గా అజ్జూ వ్యాఖ్య‌ల‌పై అంజ‌న్ ఆగ్ర‌హంతో వ్యాఖ్య‌లుచేస్తున్న వేళ‌.. సీనియ‌ర్ నేత వీహెచ్ బ‌య‌ల‌కు వెళ్లిపోయారు. మ‌రోవైపు ఈ స‌మావేశానికి న‌గ‌ర కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ గౌడ్‌.. ఆయ‌న కుమారుడువిక్ర‌మ్ గౌడ్ గైర్హాజ‌రు కావ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు