బ్రిట‌న్ టూర్ లో బ్రిటీష‌ర్ల‌కు మ‌రోసారి మండేలా చేసిన ట్రంప్

బ్రిట‌న్ టూర్ లో బ్రిటీష‌ర్ల‌కు మ‌రోసారి మండేలా చేసిన ట్రంప్

సంచ‌ల‌నాల‌కు.. వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే అమెరికా అధ్య‌క్షుడుడొనాల్డ్ ట్రంప్ త‌న బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌లో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఇప్ప‌టికే బ్రిటిష‌ర్ల‌కు ఒళ్లుమండేలా చేస్తున్న ఆయ‌న‌.. తాజాగా త‌న తీరుతో మ‌రోసారి కాలిపోయేలా చేశారు.

తాము ఎంతో భ‌క్తితో కొలిచే మ‌హారాణి ప‌క్క‌న న‌డిచే విష‌యంలో ప్రోటోకాల్ కు భంగం వాటిల్లేలా చేశార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ట్రంప్‌.. తాజాగా మ‌రోసారిసంప్ర‌దాయాల్ని ఉల్లంఘించ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. బ్రిట‌న్ రాణితో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ఆమెతో చ‌ర్చించిన విష‌యాల్ని విదేశీ ప్ర‌ముఖులు బ‌య‌ట‌పెట్ట‌కూడ‌దు. ఇందుకు భిన్నంగా ట్రంప్ మాత్రం.. తాను రాణితో జ‌రిగిన చ‌ర్చ‌ల్లోని ముఖ్య అంశాన్ని బ‌య‌ట‌పెట్ట‌టం సంచ‌ల‌నంగా మారింది.

రాణి ఎలిజిబెత్ తో జ‌రిపిన చ‌ర్చ‌పై ప్ర‌శ్న‌లు సంధించే క్ర‌మంలో ఒక పాత్రికేయుడు ట్రంప్ ను ఉద్దేవించి యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి బ్రిట‌న్ వైదొలిగే బ్రెగ్జిట్ వ్య‌వ‌హారంపై రాణితో చ‌ర్చించారా? అని ప్ర‌శ్నించ‌గా.. తాను చ‌ర్చించిన‌ట్లు వెల్ల‌డించారు. అది చాలా క్లిష్ట‌మైన స‌మ‌స్య‌గా ఆమె నాతో చెప్పారంటూ రాణి మాట‌ను చెప్పేశారు. ట్రంప్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఇదే అంశంపై బ్రిట‌న్ ప్ర‌ధాని థెరెసా మేతో క‌లిసి నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలోనూ ట్రంప్ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. బ్రెగ్జిట్ విష‌య‌మై ఈయూతో ఎలా వ్య‌వ‌హ‌రించాలో తాను ప్ర‌ధానికి స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా చెప్పి బ్రిటిష‌ర్ల మ‌న‌సులు నొచ్చుకునేలా చేశార‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్య‌క్షుడిగా రెండోసారి కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టాల‌న్న మాట‌ను తాజాగా స్ప‌ష్టం చేశారు. 2020లో జ‌రిగే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని తేల్చి చెప్పిన ఆయ‌న‌.. త‌న‌ను మ‌రోసారి అమెరికా అధ్య‌క్షుడు కావాల‌ని అమెరిక‌న్లు కోరుకుంటున్న‌ట్లుగా ట్రంప్ వెల్ల‌డించారు. మ‌రి.. దీనికి అమెరికన్ల రియాక్ష‌న్ కంటే.. ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రిప‌బ్లిక‌న్ పార్టీ ప్ర‌తినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు