జ‌గ‌న్‌కు కేంద్ర‌మంత్రి ఆహ్వానం వెనుక క‌థేంటి?

జ‌గ‌న్‌కు కేంద్ర‌మంత్రి ఆహ్వానం వెనుక క‌థేంటి?

ఏపీ రాజ‌కీయాల్లో ఏం జ‌రుగుతుందో అర్థం కాక సామాన్యుడు జుట్టు ప‌ట్టుకుంటున్నాడు. ప్ర‌త్యేక హోదా అని జ‌గ‌న్ అంటాడు కానీ మోడీని అడ‌గ‌డు.  అవినీతి గురించి ప‌వ‌న్ మాట్లాడ‌తాడు. కానీ 11 అవినీతి కేసుల్లో ఉన్న జ‌గ‌న్ గురించి కామెంట్ చేయ‌డు. రాష్ట్రం కోసం ప్రాణ‌మైనా ఇస్తాననే ప‌వ‌న్ క‌నీసం కేంద్రాన్ని డిమాండ్ చేయ‌డు. 70 వేల కోట్లు కేంద్రం నుంచి ఏపీకి రావాల్సి ఉంద‌ని తేల్చిన ప‌వ‌న్ క‌మిటీ మాట గురించి  చాలా క‌న్వీనియెంట్‌గా ప‌క్క‌న పెట్టేశారు. అయితే, గ‌రుడ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌ని న‌టుడు, రాజ‌కీయ నాయకుడు శివాజీ చెబితే ఆ త‌ర్వాత కొంత క్లారిటీ వ‌చ్చింది. కానీ ఇంకా చాలా అనుమానాలు మిగిలే ఉన్నాయి. అయితే, కేంద్రమంత్రి రామ్‌దాస్ అథ‌వాలే చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్రంలో  ఈ రోజు ఫుల్ క్లారిటీ వ‌చ్చింది.

ఇంత‌కీ రామ్‌దాస్ ఏమ‌న్నారంటే... *వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిని తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నాం. జగన్‌ ఎన్డీయేతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై మోదీ, అమిత్‌ షాలతో తాను మాట్లాడతానని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి వైదొలగడం చంద్రబాబు తొందరపాటు నిర్ణయం. ఆయన ఎన్డీయేలో కొనసాగి ఉంటే హోదాపై మోదీ సానుకూలంగా స్పందించేవారు* ఇవీ కేంద్ర మంత్రి మాట‌లు. ఈ వ్యాఖ్య‌ల‌ను విశ్లేషిస్తే ఇది బ‌హిరంగ బ‌రితెగింపు అని అర్థం అవుతుంది.

జ‌గ‌న్‌ను సీఎం చేస్తే ప్ర‌జ‌లు చేయాలి. ప్ర‌జ‌లు సీఎం చేయాలి అనుకుంటే ఆప‌డానికి మోడీకి హ‌క్కు లేదు. అవ‌కాశం లేదు. కానీ ఈ మాట కేంద్ర మంత్రి మీడియాతో నేరుగా అన‌గ‌లిగారు అంటే దాని అర్థం ఏంటి? క‌చ్చితంగా జ‌గ‌న్తో సంబంధం అయినా ఉండాలి.. లేక‌పోతే ఏదో ఒక పొలిటిక‌ల్ గేమ్ అయినా న‌డుస్తుండాలి, అదీ కాదంటే.. బీజేపీ కేసుల ఆధారంగా జ‌గ‌న్‌ను లాక్ చేసి ఉండాలి. కేసుల కోణంలో మాత్రం ప్ర‌జ‌లు గెలిపించిన ఒక ముఖ్య‌మంత్రిని కేంద్రం అడ్డుకోగ‌ల‌దు. లేదా ఎన్నిక‌ల ముందు థ‌ర్డ్ పార్టీతో జ‌గ‌న్‌కు అడ్డువేయాలి. జ‌గ‌న్ వీరితో కలిస్తే ఆ థ‌ర్డ్ పార్టీని జ‌గ‌న్‌తో క‌లుపుతారు. ఇవ‌న్నీ ఆలోచిస్తే మొత్తానికి ఏపీలో ఒక పొలిటిక‌ల్ ఆపరేష‌న్ న‌డుస్తుంద‌న్నది మాత్రం రామ్‌నాథ్ వ్యాఖ్య‌ల‌తో స్పష్ట‌మైంది.

మ‌రో కోణం ఏంటంటే... ఎవ‌రో ఒక కేంద్ర మంత్రి ఏపీ ప్ర‌త్యేక హోదాకు రెక‌మెండ్ చేస్తే హోదా వ‌స్తుందా? క‌చ్చితంగా రాదు. అంటే బీజేపీ మ‌న‌సులో మాట జ‌స్ట్ ఆయ‌న నోటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది అంతే. దీన్ని బ‌ట్టి... ప్ర‌త్యేక హోదాను బీజేపీ ఒక పొలిటిక‌ల్ స్టాండ్‌గా, ఒక ఎమోష‌న్‌గా వాడుకుంటోంది. ఇదంతా ప‌క్కాగా ఒక పొలిటిక‌ల్‌ ప్లాన్‌. బీజేపీ పొలిటిక‌ల్ గెయిన్ కోసం ఏపీ ఏమైపోయినా ప‌ర్లేదు. మోడీ త‌న బ‌లాన్ని దేశం నిల‌బ‌డేందుకు కాకుండా బీజేపీ నిల‌బ‌డేందుకు వాడుతున్నార‌న్న‌మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English