బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ రెడీ !

బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్ రెడీ !

క్లిష్ట‌మైన సంద‌ర్భాలు గ‌ట్టెక్క‌డం చంద్ర‌బాబుకు స్వానుభవం. బ‌హుశా దేశంలో ఏ రాజ‌కీయ పార్టీ ఎదుర్కోన‌న్ని అతి క‌ష్ట‌మైన సంద‌ర్భాలు తెలుగుదేశానికి ఎదుర‌య్యాయి. కేవ‌లం త‌న చ‌తుర‌త‌తో చంద్ర‌బాబు గెలిచాడు. మ‌నం ఏదైనా గూగుల్‌లో టైప్ చేస్తుంటే... మ‌నం వెత‌క‌బోయింది గూగుల్ గెస్ చేసిన‌ట్లు ముందే చూపించేస్తుంది. అటుఇటుగా బాబు మాట‌ల‌ను చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. బ‌య‌ట కామ‌న్ మాన్ టాక్ ఏదైతే న‌డుస్తుంటుందో... జ‌నం అడ‌గ‌కుండానే చంద్ర‌బాబు నుంచి ఆ అనుమానాల‌కు, ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వ‌స్తుంటాయి. ఇది ఎలా జ‌రుగుతుందంటే.. అదంతా చంద్ర‌బాటు నెట్‌వ‌ర్క్, హార్డ్ వ‌ర్క్‌. పొలిటిక‌ల్‌గా ఏ సిట్యుయేష‌న్ అయినా గ‌ట్టెక్క‌డంలో బాగా అల‌వాటు చేసేసుకున్నారు.
 
 ఇపుడు ఏపీలో ప్ర‌భుత్వానికి ఉన్నంత మంచి పేరు స్థానిక నేత‌లకు లేదు. ఇది బాబు దాకా చేరింది. అందుకే చంద్ర‌బాబు వ్యూహం మార్చారు. ఎవ‌రైనా ఏదైనా మాట్లాడేట‌పుడు *సంవ‌త్స‌రాలు* అనే ప‌దం వాడితే అది చాలా సుదీర్ఘ కాలం అనిపిస్తుంది. అదే రోజులు అంటే చాలా త‌క్కువ టైం అనిపిస్తుంది. ఈ పాయింట్‌ను బాబు ప‌ట్టేశాడు. అందుకే 1500 రోజుల పాల‌న‌. ఏపీ విజ‌యాలు.. కాన్సెప్ట్‌ను జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

జులై 15 నాటికి ఏపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 1500 రోజులు అవుతోంద‌ట‌. ఇలా రోజుల్లో వింటే చాలా తక్కువ టైం అనిపిస్తుంది. అందుక‌నే బాబు దీనిని ఇలా డీల్ చేస్తున్నాడు. నిజానికి రాజ‌ధాని, పరిశ్ర‌మ‌లు, ఐటీ లేని రాష్ట్రానికి సీఎం కావాల‌నుకోవ‌డ‌మే సాహ‌సం. ఎందుకంటే అది చ‌క్రాల్లేని బండిని ముందుకు తోయ‌డం లాంటిది. ఎన్ని చేసినా ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కోక త‌ప్ప‌దు. అది ప్ర‌జాస్వామ్యం. అందుకే 40 ఏళ్ల బాబు 4 ఏళ్లు చేశారంటూ ప్ర‌తిప‌క్షాలు వేసే ప్ర‌శ్న‌ల‌కు బాబు అపుడే ఫ్యూచ‌ర్ ప్లాన్ రెడీ చేసేశారు.

నాలుగేళ్లు అంటే 1500 రోజులు కొత్తగా ఏర్ప‌డిన ఏపీకి చాలా త‌క్కువ టైం. అయినా.... ఏపీ దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ల‌కు, వ్యాపారానికి అనుగుణ‌మైన వాతావ‌ర‌ణం క‌లిగిన అత్యుత్త‌మ రాష్ట్రంగా నిల‌బ‌డిందంటే.. దేశ‌మంతా ఆశ్చ‌ర్య‌పోయింది.  *మోడీ మ‌న‌కా క్రెడిట్ ద‌క్కకుండా అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించి, విధిలేక ఇచ్చేశారు* అని బాబు దీనిపై వ్యాఖ్యానించారు.

ఇక బాబు ఫ్యూచ‌ర్ ప్లాన్‌లో ఏమున్నాయంటే...

1500 రోజుల్లో ఏపీ ప్ర‌భుత్వ విజ‌యాల‌ను 100 స‌భ‌లు పెట్టి చంద్ర‌బాబు స్వ‌యంగా వివ‌రించ‌నున్నారు. వీటిని నాలుగుర‌కాలుగా విభ‌జించారు... రైతుల కోసం, పొదుపు సంఘాల కోసం, ఉపాధి క‌ల్ప‌న కోసం, సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం.... వీటిలో ప్ర‌భుత్వం సాధించిన విజ‌యాల‌ను బాబు స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున గ్రామ‌ద‌ర్శిని - గ్రామ వికాసం అని మ‌రో ప్రోగ్రాం పెట్టారు. ఒక‌వేళ లోక‌ల్ రాజ‌కీయాల వ‌ల్ల ఎవ‌రికైనా ల‌బ్ధిదారుల‌కు ఏదైనా అంద‌క‌పోతే దానిని ప‌రిష్క‌రించి ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ‌డం వీటి ఉద్దేశం.

టీడీపీ అధికారంలోకి వ‌చ్చాక‌- రాక ముందు అనే ప్ర‌ణాళిక‌తో అభివృద్ధిని వివ‌రించే క‌మిటీల‌తో దేశంలో ప్ర‌తి ఊరిని నాయ‌కుల ద్వారా క‌వ‌ర్ చేయ‌నున్నారు. చెప్పిన దానికంటే ప్ర‌భుత్వం ఎక్కువే చేసింది, ఎక్క‌డ‌యినా అసంతృప్తి ఉంద‌టే...దానికి లోక‌ల్ నేతలు విఫ‌ల‌మ‌యిన‌ట్లే అనుకుంటాం అంటూ హెచ్చ‌రించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు