ఆస్ప‌త్రిలో ప‌వ‌న్‌... ఏమైంది?

ఆస్ప‌త్రిలో ప‌వ‌న్‌... ఏమైంది?

ప‌వ‌ర్‌ స్టార్ అభిమానుల‌కు చిన్న బ్యాడ్ న్యూస్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు గురువారం చిన్న శ‌స్త్రచికిత్స జ‌రిగింది. నెల‌రోజులుగా ప‌వ‌న్‌ ప‌డుతున్న ఇబ్బందికి ఈ చికిత్స వ‌ల్ల విముక్తి క‌లిగింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ విశ్రాంతిలో ఉన్నారు. మరి ఇంత‌కీ ప‌వ‌ర్ స్టార్‌కు ఏమైంది?

కొంత‌కాలంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటి ప‌క్క‌న ఓ చిన్న కురుపు వంటిది ఏర్ప‌డింది. అది క్ర‌మంగా పెద్ద‌దై ఆయ‌న‌ను బాగా ఇబ్బంది పెడుతుంద‌ట‌. దీని గురించి రెండు వారాల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎల్వీ ప్ర‌సాద్ వైద్యుల‌ను సంప్ర‌దించారు. అయితే, దానిని ప‌రీక్షించిన వైద్యులు.. ఆ కురుపును తొల‌గించ‌డం త‌ప్ప మందుల వ‌ల్ల ఏ ఉప‌యోగం లేద‌ని తేల్చారు. దీంతో సమ‌యం తీసుకుని వ‌స్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ గురువారం ఆప‌రేష‌న్ కోసం ఎల్వీ ప్ర‌సాద్ ఆస్ప‌త్రిలో చేరారు. ఒక చిన్న శ‌స్త్ర చికిత్స ద్వారా డాక్ట‌ర్లు ఆ కురుపును తొల‌గించి మందులు వాడ‌మ‌ని చెప్పారు. ఒక రెండు రోజులు అయినా విశ్రాంతిలో ఉండాల్సి వ‌స్తుంద‌ని లేక‌పోతే ఇన్ఫెక్ష‌న్ల‌కు గుర‌వ్వాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు. దీంతో ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్రాంతిలో ఉన్నారు.

అయితే, ఈ కురుపు వ‌ల్ల గ‌త కొంత‌కాలంగా ప‌వ‌న్ ఇబ్బంది ప‌డుతూ వ‌స్తున్నారు. ఉత్త‌రాంధ్ర టూర్లో కూడా క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని మేనేజ్ చేశారు. ఎండ, దుమ్ము నుంచి కూడా ర‌క్ష‌ణ ఉంటుంద‌ని అద్దాలు వాడారు. కానీ ఇక ఎంతో కాలం ఆగే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆయ‌న మ‌ళ్లీ 16వ తేదీ తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు