మీ చేత‌కాక‌పోతే తాజ్‌కు తాళ‌మేయండి- సుప్రీం కోపం

మీ చేత‌కాక‌పోతే తాజ్‌కు తాళ‌మేయండి- సుప్రీం కోపం

తాజ్‌మహల్ మీద ప్రేమ కంటే ఆ మహత్తర కట్టాడం పట్ల నిర్లక్ష్యం చూపడాన్ని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తట్టుకోలేకపోయారు. అందుకే కాస్త కటువుగా ఉన్నా ఈ కఠినమైన తీర్పునిచ్చారు.

కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజ్‌మహల్ నిర్వహణపై చూపిస్తున్న నిర్లక్ష్యంపై అంతేత్తున మండిపడ్డారు. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ తాజ్‌మహల్ ముందు దిగదుడుపని, అంతటి అందమైన, సుందరమైన కట్టడంపై ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీసారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కట్టడం భారతదేశనికే ఉందని, దాన్ని చూసేందుకు లక్షలాది మంది దేశానికి వస్తారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. " విదేశి పర్యాటకుల వల్ల భారతదేశానికి ఉన్న విదేశి కరెన్సీ లోటును భర్తీ చేసుకోవచ్చును " అని సూచన కూడా చేసింది.

దేశ సమస్యను పరష్కరించే, దేశ గొప్పతనాన్ని చాటే తాజ్‌మహల్ వంటి కట్టడాలను పరిరక్షించుకోవడం జాతి చారిత్రిక అవసరమని పేర్కొంది. తాజ్ ట్రాపెజియమ్ జోన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించి నిర్మణాలు చేపట్టిన అంశంపై కూడా సుప్రీం కోర్టు కన్నేర్ర చేసింది.  మొట్టికాయలు తినడమే తప్ప ఆచరణలో ఎలాంటి పురోగతి చూపించని ప్రభుత్వాలకు సుప్రీం ఆగ్రహం కళ్లు తెరిపిస్తుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు