బీజేపీ చూపు రజినీకాంత్ వైపు

బీజేపీ చూపు రజినీకాంత్ వైపు

సౌత్‌పై ఏమాత్రం పట్టు దొరక్కుంటున్న ఆశ చంపుకోకుండా ప్రయత్నిస్తున్న బీజేపీ తాజాగా మరోసారి తమిళనాడు రాజకీయాలపై కన్నేసింది. జయలలిత మరణ సమయంలో, ఆ తరువాత తమిళనాడుపై గ్రిప్ కోసం శతథా ప్రయత్నించిన బీజేపీ తమ ఎత్తులు పనిచేయకపోవడంతో ఆ తరువాత కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, తమ పార్టీకి ఫేస్ కోసం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.

ఇందులో భాగంగా నటుడు రజనీకాంత్‌తో కలిసి నడవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన త్వరలో ప్రకటించనున్న పార్టీతో పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ చీఫ్ అమిత్ షా పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకే, డీఎంకేలతో ప్రమేయం లేకుండా రజనీతో వెళ్లడమే బెటరన్నది అమిత్ షా యోచనగా తెలుస్తోంది.

జయ మరణం తరువాత అన్నాడీఎంకేను తన గుప్పిట్లోకి తీసుకుని తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నించిందన్న విమర్శలున్నాయి. కానీ.. తమిళ ప్రజల నుంచి బీజేపీ పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోగా అప్పటి పరిణామల నేపథ్యంలో బీజేపీపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయినా... తన ప్రయత్నాలు తాను చేస్తూ అన్నా డీఎంకే లోని రెండు వర్గాలు పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలన బీజేపీ కలిపింది. కానీ.. ఏమైందో కానీ ఆ తరువాత ఓ బహిరంగ సభలో అన్నాడీఎంకే పాలనపై అమిత్ షా దుమ్మెత్తి పోశారు. తమిళనాడులో అవినీతి పెరిగిపోతోందని ఆరోపించారు. దీంతో రెండు పార్టీల మధ్య  వ్యవహారం చెడింది.

మరోవైపు బీజేపీ... అన్నాడీఎంకేతో వ్యవహారం నెరుపుతూనే రజినీ కాంత్ ను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసింది. అది కూడా వర్కవుట్ కాలేదు. కానీ... ఇప్పుడు మరోసారి బీజేపీ ర‌జనీకాంత్‌తో పొత్తు కోసం ట్రై చేస్తోంది. రజీనితో పొత్తు పెట్టుకోవడం ద్వారా కొత్త కూటమి ఏర్పాటు చేసి తమిళనాట అధికారాన్ని చెలాయించాలన్నది అమిత్ షా తాజా వ్యూహంగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English