స్వామి ప‌రిపూర్ణ‌నందపై న‌గ‌ర.. కేసీఆర్ రీజ‌నేంటి?

స్వామి ప‌రిపూర్ణ‌నందపై న‌గ‌ర.. కేసీఆర్ రీజ‌నేంటి?

శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేశ్ అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. దీనిపై స్వామి ప‌రిపూర్ణానంద రియాక్ట్ కావ‌టం.. ఆయ‌న తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న యాత్ర‌ను చేప‌డ‌తాన‌నంటూ ప్ర‌క‌టించ‌టమూ తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. యాత్ర‌కు తొలుత అనుమ‌తి ఇచ్చిన హైద‌రాబాద్ పోలీసులు ఆ త‌ర్వాత అనుమ‌తి ర‌ద్దు చేశారు. అనంత‌రం ఆయ‌న‌ను గృహ నిర్బంధం చేశారు.

క‌త్తి గురించి మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌ప్ప ఇత‌రులు ఎవ‌రూ జోక్యం చేసుకోలేదు. రాముడి గురించి మాట్లాడ‌టంతో హిందువులు మండిప‌డ్డారు. ప‌రిపూర్ణానంద స్పందించారు. దీంతో కత్తి విష‌యంపై చేసిన ఆల‌స్యానికి ప్ర‌భుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. అత‌నిపై బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. ఇక్క‌డే కొత్త క‌థ మొద‌లైంది.

మంద కృష్ణ మాదిగ‌, ఇత‌ర సంఘాలు, కాంగ్రెస్ ఇవ‌న్నీ ఇపుడు ద‌ళిత కార్డుతో కేసీఆర్ మీద దాడి చేస్తాయి. ఇంత‌కాలం రాజ‌కీయ వ్యూహంతో వారిని కేసీఆర్ గ‌ట్టిగానే సైలెంట్ చేశారు. కానీ క‌త్తిపై వేటు వారంద‌రికీ ఇపుడు కొత్త అవ‌కాశం ఇస్తుంది. అందుకే వెంట‌నే ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టిన ప్ర‌భుత్వం రాత్రికి రాత్రి ప‌రిపూర్ణానంద‌పై కూడా న‌గర బ‌హిష్క‌ర‌ణ వేటు వేసింది. మ‌రి అలాచేస్తే బీజేపీతో ఇబ్బంది క‌దా అనిపిస్తుంది. కానీ బీజేపీ దీనివ‌ల్ల కొత్త‌గా బ‌ల‌ప‌డేది ఏం లేదు. ఒక వేళ బీజేపీ బ‌ల‌ప‌డినా కేసీఆర్‌కు పెద్ద న‌ష్టం లేదు. ఎందుకంటే రేపు వారితో పొత్తు అయినా పెట్టుకోగ‌ల‌డు. కానీ కాంగ్రెస్‌కు అవ‌కాశం దొరికితే అది చిన్న‌ది అయినా కూడా కేసీఆర్‌కే న‌ష్టం.

అందుకే ప‌రిపూర్ణానందపై వేటు వేశారు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వం ఎవ‌రి ప‌ట్ల ప్రేమ లేద‌ని చెప్పుకోవ‌డానికి ఒక అవ‌కాశం ఉంటుంది. ఇప్ప‌టికే మొద‌టి ద‌ళిత‌ సీఎం హామీ కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్న నేప‌థ్యంలో ఇది ఇంకోత‌ల‌నొప్పి కాకూడ‌ద‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. అందుకే ప‌రిపూర్ణానంద‌పై వేటు వేశారు. దీనివ‌ల్ల ద‌ళితుల‌నే కాదు, తెలంగాణ లో పెద్ద ఓటు బ్యాంకు అయిన ముస్లింల‌ను కూడా శాంత‌ప‌ర‌చ‌వ‌చ్చు.

ఇదిలా ఉండ‌గా... కేసీఆర్ ఊహించిన‌ట్టే మంద కృష్ణ మాదిగ స్పందించారు. దళితుడు అయినందునే కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ విధించారని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తాజాగా ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు