రాజ‌కీయ స‌న్యాసం..ఆయ‌న్ను కేటీఆర్ సెటిల్ చేశాడు

రాజ‌కీయ స‌న్యాసం..ఆయ‌న్ను కేటీఆర్ సెటిల్ చేశాడు

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో నెల‌కొన్న క‌ల‌క‌లం స‌ద్దుమ‌ణిగింది. రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ త‌న ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కు తీసుకున్నాడు. అయితే ఈ కీల‌క ప‌రిణామానికి ఆయ‌న్ను ఒప్పించింది...స‌మ‌స్య‌ను `సెటిల్‌` చేసింది ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాదు. ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌!  నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకోవ‌డ‌మే కాకుండా...కేసీఆర్ లాంటి గొప్ప నేత ఎవ‌రూ లేరంటూ ప్ర‌శంసించారు కూడా!

రామ‌గుండం నియోజ‌కవ‌ర్గం మున్సిపాలిటీలో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు తారాస్థాయికి చేర‌డం, ఇందులో ఎమ్మెల్యే సోమార‌పు ఒక గ్రూప్‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించి సొంత పార్టీ చైర్మ‌న్‌పైనే అవిశ్వాసం నోటీసు ఇప్పించ‌డం...దీనిపై కేటీఆర్ కామెంట్లు చేయ‌డం...దాంతో సోమారపు స‌త్య‌నారాయ‌ణ హ‌ర్ట్ అయి రాజ‌కీయ స‌న్యాసం తెలిసిన సంగ‌తే. అయితే ఈ స‌మ‌స్య‌ను కేటీఆర్ ప‌రిష్క‌రించారు. ఇవాళ ఆయ‌న్ను హైద‌రాబాద్ పిలిపించి మాట్లాడిన కేటీఆర్ నిర్ణ‌యం వెన‌క్కు తీసుకోవాల్సిందిగా కోరారు. మీలాంటి సీనియర్ల అవసరం పార్టీకి ఉందని, ఎన్నికలు వస్తున్న వేళ అస్త్ర సన్యాయం చేయడం సరికాదని సోమారపు సత్యనారాయణకు మంత్రి కేటీఆర్ సూచించారు. దీంతో సోమార‌పు మెత్త‌బ‌డ్డారు. అనంత‌రం తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటుగా పార్టీ చేరిక‌ల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న‌ట్లు సోమార‌పు వెల్ల‌డించారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు తాను పార్టీలో కొనసాగుతానని ప్రకటించారు.  మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బాగా పనిచేస్తున్నారని…ఇలాంటి టీం ను వదిలి వెళ్లడం తనకు ఇష్టం లేదన్నారు. 15 ఏళ్ల తన పొలిటికల్ కేరీర్ లో సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదన్నారు. పార్టీలో కొన‌సాగుతాన‌ని, త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు