టైటిల్ సీక్రెట్ అందుకేనా?

టైటిల్ సీక్రెట్ అందుకేనా?

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచి స్టార్ డమ్ ను అందిపుచ్చుకుని మరీ సినిమాల్లోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు. సినిమాలు చేయడంలో మాత్రం తండ్రిలా కాకుండా చాలా క్యాలిక్యులేటెడ్ గా చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా భరత్ అనే నేను సినిమాలో యంగ్ అండ్ డైనమిక్ సీఎంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇంతవరకు హీరోలు 24 సినిమాలు పూర్తి చేసిన మహేష్ ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ ఫిలిం చేస్తున్నాడు.

పైడిపల్లి వంశీ దర్శకత్వంలో వస్తున్న 25వ సినిమాపై అభిమానుల్లో బోలెడు అంచనాలున్నాయి. ఇప్పటికే  ఈ మూవీ షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తయింది. తరవాత షెడ్యూల్ కోసం ఫారిన్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సినిమా టైటిల్.. కాన్సెప్ట్ లాంటివేమీ ఇంకా రివీల్ చేయలేదు. కనీసం ఫస్ట్ లుక్ కూడా బయటపెట్టలేదు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే స్పెషల్ గా ఆ రోజు సినిమాకు సంబంధించి టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ బయటపెట్టాలన్నది నిర్మాతల ఆలోచనగా ఉందని తెలుస్తుంది.

మహేష్ బర్త్ డే రోజు అభిమానులను థ్రిల్ చేసే ఉద్దేశంతోనే ఈ సినిమా టైటిల్ గా ఏం పెట్టాలన్నది సీక్రెట్ గా ఉంచేశారు. టాలీవడ్ టాప్ బ్యూటీ పూజా హెగ్డే  ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కామెడీ హీరోగా నవ్వులు పూయించే అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. దిల్ రాజు అశ్వనీదత్ పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు