మోడీ కేర్ డొల్ల‌త‌నాన్ని ప్ర‌శ్నించిన అంత‌ర్జాతీయ ఆర్థిక‌వేత్త‌

మోడీ కేర్ డొల్ల‌త‌నాన్ని ప్ర‌శ్నించిన అంత‌ర్జాతీయ ఆర్థిక‌వేత్త‌

కొన్నిసార్లు కాలం అంతే. ఇంటా బ‌య‌టా పొగ‌డ్త‌లు.. ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తేస్తుంటారు. మ‌రోసారి.. అప్ప‌టివ‌ర‌కూ ఆకాశానికి ఎత్తేసిన వారు సైతం త‌మ విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతుంటారు. తాజాగా ప్ర‌ధాని మోడీ ప‌రిస్థితి ఇలానే ఉంది. మొన్న‌టి వ‌ర‌కూ త‌న మాట‌ల‌తో ఉద‌ర‌గొట్టేసిన మోడీని ఎంతో ఊహించుకున్నారు.

ఆయ‌న హ‌యాంలో ఏదో జ‌రిగిపోతుంద‌న్న క‌ల‌లు క‌న్నోళ్ల‌కు త‌క్కువ లేదు. అయితే.. అదంతా ఉత్త భ్ర‌మే త‌ప్పించి మ‌రింకేమీ లేద‌న్న విమ‌ర్శ‌లు ఈ మ‌ధ్య‌న ఎక్కువ అవుతున్నాయి. ఆయ‌న పాల‌న‌లోని లోపాల్ని సునిశితంగా ఎత్తి చూపిస్తున్న వైనం చూసిన‌ప్పుడు మోడీ స‌మ‌ర్థ‌త మీద కొత్త అనుమానాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా అంత‌ర్జాతీయ ఆర్థిక నిపుణుడు ఒక‌రు మోడీ క‌ల‌ల ప్రాజెక్టుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్త‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మోడీ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటున్న మోడీ కేర్ లోని డొల్ల‌త‌నాన్ని ప్ర‌శ్నిస్తూ.. అదంతా ప్ర‌చార ఆర్భాట‌మే త‌ప్పించి మ‌రింకేమీ కాదంటూ చేస్తున్న విశ్లేష‌ణ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

తాజా బ‌డ్జెట్‌లో మోడీ కేర్ అంటూ గొప్ప‌లు చెప్పిన కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ మాస్టారు అయితే ఆకాశానికి ఎత్తేశారు. ఒబామా కేర్ విజ‌య‌వంతం అవుతుందో లేదో కానీ మోడీ కేర్ మాత్రం అవుతుంద‌ని.. ప్ర‌పంచంలో కెల్లా అతి పెద్ద పథ‌కంగా గొప్ప‌లు చెప్పుకున్నారు.

అయితే.. మోడీ కేర్ అంతా లోప‌భూయిష్ట‌మ‌ని.. ఇందులోని అంశాలు మాయ చేయ‌ట‌మే త‌ప్పించి మ‌రింకేమీ లేద‌న్న భావ‌న వ‌చ్చేలా ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ విమ‌ర్శిస్తున్నారు. ప‌ది కోట్ల నిరుపేద కుటుంబాల‌కు ఏటా రూ.5ల‌క్ష‌ల మేర వైద్య బీమా చేయించే ఈ ప‌థ‌కం ప్ర‌పంచంలో కెల్లా పెద్ద‌ద‌ని చెబుతున్నార‌ని అయితే.. బ‌డ్జెట్‌లో కేటాయించిన నిధులు చూస్తే.. ఈ ప‌థ‌కం ప‌స ఇట్టే తెలిసిపోతుందంటున్నారు.

మోడీ కేర్ కోసం బ‌డ్జెట్‌లో కేటాయించిన రూ.2వేల కోట్ల‌ను  పంచితే ఒక్కొక్క‌రికి రూ.20 కూడా రావ‌టం లేద‌ని.. దీంతో 50 కోట్ల మందికి బీమా ఎలా సాధ్య‌మ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిజ‌మే.. జీన్ లాజిక్కులోనూ పాయింట్ ఉంది? ఒక‌వేళ కుటుంబానికి ముగ్గురు చొప్పున వేసుకున్నా.. వంద దాట‌ని ఈ కేర్.. నిరుపేద‌ల‌కు ర‌క్ష‌గా నిలిచే వీలుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు