శృంగార‌ గురు బ‌యోపిక్ లో స్టార్ హీరో!

శృంగార‌ గురు బ‌యోపిక్ లో స్టార్ హీరో!

ఇప్పుడంతా బ‌యోపిక్ ల జోరు సాగుతోంది.  బ‌యోపిక్ అంటే మినిమం గ్యారెంటీగా మార‌ట‌మే కాదు.. ఏ మాత్రం బాగున్నా.. వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో బ‌యోపిక్ ను తెర మీద‌కు తెచ్చేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. అయితే.. ఇదేమీ అషామాషీ వ్య‌వ‌హారం కాదు.

త‌న‌దైన తత్త్వంతో దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోని ప‌లు దేశాల్లో సంచ‌ల‌నం సృష్టించిన శృంగార గురు క‌మ్ అధ్మాత్మిక భోద‌న‌ల‌తో ఒక ప‌ట్టాన అర్థం కాని సంప‌న్న గురు ఓషోపై బ‌యోపిక్ తీసేందుకు రెఢీ అవుతున్నారు. క్లిష్ట‌మైన వాద‌న‌తో పాటు.. ప్ర‌తిదాంట్లోనూ లాజిక‌ల్ కంక్లూజ‌న్ చెప్పే ఓషో జీవితం మొత్తం వివాదాల‌తో నిండి ఉంటుంది. ఆయ‌న‌పై అగ్ర‌రాజ్యం అమెరికా సైతం క‌త్తి క‌ట్ట‌టం.. ఆయ‌న్ను చంపేందుకు కుట్ర ప‌న్నింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఆయ‌న చెప్పే శృంగారం విధానాల మీదా.. జీవితంలో సెక్స్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త‌తో పాటు.. అనేక అంశాల‌పై ఆచార్య ర‌జ‌నీష్ చెప్పే వాద‌న‌ల‌పై ఇప్ప‌టికి జోరుగా చ‌ర్చ‌లు సాగుతుంటాయి. ప్రాక్టిక‌ల్ గా జీవించ‌టం ఒక ఎత్తు అయితే.. మ‌న‌సుకు న‌చ్చింది చేయ‌టం.. బంధాల విష‌యంలో నిజాయితీ ఉండ‌టంతో పాటు.. జీవితాన్ని కొత్త కోణంలో చూపించే ఓషో జీవితాన్ని తెర‌కెక్కించ‌టం సాహ‌సమే.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్ర‌ముఖులు అమిర్ ఖాన్.. క‌ర‌ణ్ జోహార్ లు తీసేందుకు రెఢీ అవుతున్న‌ట్లు చెబుతున్నారు. గ‌తంలో క‌పూర్ అండ్ స‌న్స్ మూవీని రూపొందించిన శ‌కున్ బ‌త్రా ఓషో బ‌యోపిక్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని చెబుతున్నారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ మూవీని సిద్ధం చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ చూసినంత‌నే అమిర్ ఓకే చెసిన‌ట్లుగా చెబుతున్నారు. ఓషో జీవితం మొత్తం సంచ‌ల‌నం.. వివాదాస్ప‌దంగా అభివ‌ర్ణిస్తుంటారు. మ‌రి.. అలాంటి మూవీని చేప‌ట్ట‌టం అంటే.. రిస్కే. మ‌రి.. ఈ మూవీ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వుతాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు