కుర్రాడి దెబ్బ‌కు ఫుల్ హ‌ర్ట్ అయిన సీఎం

కుర్రాడి దెబ్బ‌కు ఫుల్ హ‌ర్ట్ అయిన సీఎం

గ‌డిచిన కొద్ది రోజులుగా బిహార్ రాజ‌కీయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జేడీయూ.. లాలూకు చెందిన ఆర్జేడీ.. కాంగ్రెస్ లు క‌లిసి పోటీ చేయ‌టం అధికారంలోకి వ‌చ్చాయి. ఒంట‌రిగా పోరాడి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పాట్నా పీఠాన్ని సొంతం చేసుకోవాల‌నుకున్న క‌మ‌ల‌నాథుల ఆశ‌లు నెర‌వేర‌లేదు. అయితే.. బిహార్ లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత లాలూ కొడుకుల తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన నితీశ్.. ఆ మ‌ధ్య‌న లాలూతో క‌టీఫ్ చెప్పేసి మోడీ బ్యాచ్ తో క‌ల‌వ‌టం.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ మ‌ధ్య‌న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ తీవ్ర అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. ఆయ‌నిప్పుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో బిహార్ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న నితీశ్‌కుమార్ లాలూ ఆరోగ్యంపై ప‌దే ప‌దే ఫోన్లు చేస్తూ ప‌రిస్థితి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. లాలూ ఆరోగ్యం మీద త‌ర‌చూ వాక‌బు చేస్తుండ‌టంతో మీడియాలో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మోడీతో నితీశ్ కు స‌త్ సంబంధాలు లేవ‌ని.. రానున్న ఎన్నిక‌ల వేళ‌కు కాంగ్రెస్ కూట‌మితో జ‌త క‌ట్టేందుకు నితీశ్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా  క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఆర్జేడీతో త‌న స్నేహాన్ని పున‌రుద్ధ‌రించుకునేందుకు ట్రై చేస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు షురూ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో లాలూ కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్ర‌తాప్ తీవ్ర‌స్థాయిలో రియాక్ట్ అయ్యారు.

కూట‌మిలోకి కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వ‌మ‌ని.. మా ఇంట్లోకి నితీశ్ చాచాకు అనుమ‌తి లేద‌ని బోర్డు పెట్టాల‌నుకున్న తాము.. మ‌హాకూట‌మిలోకి ఎలా ఆహ్వానిస్తామ‌ని తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. దీనిపై నితీశ్ రియాక్ట్ అయ్యారు. తేజ్ వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అవుతూ.. అలా మాట్లాడ‌టం స‌బ‌బు కాద‌ని.. ఎవ‌రెలా బాధ ప‌డుతున్నా ప‌ట్టించుకోర‌నేది వారి మాట‌ల‌తో అర్థ‌మైంద‌న్నారు.
లాలూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడ్ని ప్రార్థిస్తున్నాన‌ని.. ఇక‌పై వారింటికి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీయ‌న‌ని చెప్పారు. లాలూ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడ్ని కోరుకుంటానే కానీ వాళ్లింటికి ఫోన్ చేయ‌ను. పేప‌ర్లో అంద‌రి మాదిరి తెలుసుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. మొత్తానికి తేజ్ మాట‌ల‌కు బాబాయ్ బాగానే హ‌ర్ట్ అయిన‌ట్లున్నారే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు