ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎత్తి పోయిన‌ట్లేనా కేసీఆర్‌

ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎత్తి పోయిన‌ట్లేనా కేసీఆర్‌

తన‌దైన వాద‌న‌తో ఎప్పుడేం చేసినా.. మెజార్టీ వ‌ర్గం త‌న‌ను స‌మ‌ర్థించేలా చేసుకోగ‌ల‌గ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక‌త‌గా చెప్పాలి. ఆ మ‌ధ్య‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఆయ‌న కొత్త త‌ర‌హా వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చి.. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీల‌కు ప్రత్యామ్నాయంగా కొత్త త‌ర‌హా రాజ‌కీయాన్ని తీసుకురావాల్సిన అవ‌స‌రాన్ని చెప్పుకొచ్చారు. రాష్ట్రాల‌కు మ‌రిన్ని అధికారాలు ఇవ్వాల‌న్న ఆయ‌న‌.. రానున్న రోజుల్లో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ భావ‌జాలాన్ని ముఖ్య‌నేత‌ల‌కు వివ‌రిస్తాన‌ని చెప్పారు.

ఇందులో భాగంగా ఆయ‌న కొన్నిరాష్ట్రాల‌కు వెళ్లి.. ప‌లువురు పార్టీ అధినేత‌ల‌తో భేటీ అయ్యారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై అదే ప‌నిగా ప్ర‌క‌ట‌లు చేసిన కేసీఆర్‌.. గ‌డిచిన కొద్ది కాలంగా మౌనంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఎత్తిపోయేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
జ‌మిలి ఎన్నిక‌ల మీద లా క‌మిష‌న్ ప‌లు పార్టీల అభిప్రాయాల్ని తీసుకోవ‌టం తెలిసిందే.

అయితే.. అన్ని రాజ‌కీయ పార్టీలు జ‌మిలి ఎన్నిక‌ల‌ను పూర్తిస్థాయిలో వ్య‌తిరేకించ‌ట‌మే కాదు.. రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని మండిప‌డ్డాయి. జ‌మిలి ఎన్నిక‌ల ప్రాథ‌మిక ల‌క్ష్యం కూడా త‌ప్ప‌న్న‌ట్లుగా వాద‌న‌లు వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో టీఆర్ఎస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ను చేసింది. ఆదివారం లా క‌మిష‌న్ కు జ‌మిలి ఎన్నిక‌ల‌పై త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది.

జ‌మిలికి సంపూర్ణ మద్ద‌తు ప్ర‌క‌టించ‌ట‌మే కాదు.. త‌మ పార్టీ అభిప్రాయాన్ని లా క‌మిష‌న్ కు తెలియ‌జేశారు పార్టీ ప్ర‌తినిధి క‌మ్ ఎంపీ వినోద్ కుమార్‌. కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి ఆటంకం లేకుండా పాల‌న సాగించాలంటే జ‌మిలి ఎన్నిక‌ల అవ‌స‌రం ఉంద‌ని పేర్కొన్నారు. ఐదేళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో జ‌రిగే ఎన్నిక‌ల కోసం ప్ర‌ధాన‌మంత్రులు ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నార‌ని.. ప్ర‌తి ఏడాది ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని.. దీని కార‌ణంగా పెద్ద ఎత్తున డ‌బ్బు.. స‌మ‌యం వృధా అవుతోంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మిగిలిన రాజ‌కీయ పార్టీలు జ‌మిలి ఎన్నిక‌ల‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే.. కొత్త త‌ర‌హా రాజ‌కీయాన్ని ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ద్వారా చూపిస్తాన‌ని చెప్పిన కేసీఆర్ మాత్రం.. అందుకు భిన్నంగా జ‌మిలికి మ‌ద్ద‌తుగా ఓటు వేసిన నేప‌థ్యంలో త‌న‌తో క‌లిసి వ‌చ్చేందుకు వీల్లేని విధంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు