ప్రధాని మోదీకి తెలుగోడి నేతృత్వంలో భారీ భద్రత

ప్రధాని మోదీకి తెలుగోడి నేతృత్వంలో భారీ భద్రత

కొద్దికాలంగా ప్రధాని మోదీ భద్రతపై హోంశాఖ మరింత అప్రమత్తమవుతోంది. మావోయిస్టు పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి లేఖల నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీ భద్రత విషయంలో కేంద్రం ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ తాజా జైపూర్ పర్యటనకు భారీ ఎత్తున భద్రత కల్పిస్తున్నారు. ఏకంగా 8 వేల మంది పోలీసులు ప్రధాని భద్రత చూసుకుంటున్నారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నేడు ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో  ఆయన భద్రతకు ప్రమాదం పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఏకంగా 8 వేల మంది పోలీసులతో అసాధారణ రీతిలో భద్రత కల్పించింది. మొత్తం భద్రతంతా రాజస్థాన్ అదనపు డీజీపీ ఎన్ఆర్‌కే రెడ్డి చూసుకుంటున్నారు.

తెలుగువారైన ఎన్నార్కే రెడ్డి పర్యవేక్షలో 19 మంది ఎస్పీలు, 55 మంది అదనపు ఎస్పీలు, 95 మంది డీఎస్పీలు, 300 మంది ఇన్‌స్పెక్టర్లతోపాటు 13 కంపెనీల రాజస్థాన్ సాయుధ పోలీసులు భద్రతలో పాలుపంచుకుంటున్నారు.

కాగా మోదీ ఈ రోజు రాజస్థాన్‌లో 13 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం 2100 కోట్ల రూపాయిలు ఖర్చు చేయనున్నారు. రాజస్థాన్‌ శాసనసభకు ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడం కోసం మోడీ రాజస్థాన్‌లో పర్యటించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు