బాబు వ‌ల్లే...ఆ బీజేపీ నేత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి

బాబు వ‌ల్లే...ఆ బీజేపీ నేత‌కు కేంద్ర‌మంత్రి ప‌ద‌వి

బీజేపీతో దోస్తీకి తెలుగుదేశం పార్టీ క‌టీఫ్ చెప్పాక బీజేపీ నేత‌లు టీడీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.  బీజేపీ విమ‌ర్శ‌లకు దీటుగా బ‌దులిస్తూ ఆ పార్టీ నేత‌లకు మాట‌లు వెదుక్కునే ప‌రిస్థితి తెస్తున్నారు టీడీపీ నేత‌లు. దీనికి కొన‌సాగింపుగా బీజేపీ గురించి, ఆ పార్టీ తీరు గురించి తెలుగుదేశం నేత‌లు కొత్త‌ విశ్లేష‌ణ‌ల‌ను చేస్తున్నారు. తాజాగా ఇదే రీతిలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుడ‌నే పేరున్న పార్టీ సీనియ‌ర్ నేత రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి విశ్లేషించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్రం విభజన చట్టంలో అంశాలను ఒక్కదాన్ని కూడా అమలు చెయ్యలేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ 5ఎమ్మెల్యే సీట్లు టీడీపీ మద్దతుతోనే గెలిచిందని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రజలకు బీజేపీ వెన్నుపోటు పొడిచిందన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ రాజకీయం ప్రజలు గమనిస్తున్నారని రావుల పేర్కొన్నారు. బీజేపీ మిత్రపక్షాలతో వ్యవహరించే తీరు కొత్తనాయకత్వంలో లేదు..పాతరక్తం ఈతరం నేతలకు రాలేదని ఆరోపించారు.బీజేపీ పాలనలో ఆర్థిక నేరాల పెరిగాయని, ఎప్పుడు ఏదో ఒక  బ్యాంక్ కుంభకోణం బయటపడుతుందని అన్నారు.

కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని రావుల‌ అన్నారు. ఆయనకు మంత్రి పదవి టీడీపీ నామినేట్ చేసిందేన‌ని కొత్త పాయింట్‌ను తెర‌మీద‌కు తెచ్చారు. బీజేపీ- టీడీపీపై విమర్శలు, ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. స్వామినాథన్ రిపోర్ట్ కి బీజేపీ న్యాయం చెయ్యకుండా రైతులకు మద్దతు దర పెంచారని మండిప‌డ్డారు. బీజేపీ-టీఆరెస్ మాటల వల్ల రాజకీయం ఎటుపోతుందో తెలియటం లేదని ఆయ‌న అన్నారు. రాజకీయాల్లో అనాగరిక భాషను మాట్లాడి రాజకీయాలను కలుషితం చెయ్యద్దని కోరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English