ఇక్కడ పవన్ ట్వీట్.. అక్కడ రేణు మంటలు

ఇక్కడ పవన్ ట్వీట్.. అక్కడ రేణు మంటలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెండో కూతురిని ఈ రోజు జనాలకు పరిచయం చేశాడు. ట్విట్టర్లో ఆయన తన కూతురైన పోలిన అంజని.. చేగువేరా విగ్రహం దగ్గర నిలబడి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. తాను ఇంటర్మీడియట్ రోజుల్లో చేగువేరా గురించి చదివి ఎంత ఇన్‌స్పైర్ అయ్యానో.. ఆయన తనపై ఎలాంటి ముద్ర వేశారో వివరించాడు పవన్.

సందర్భం ఏదైనప్పటికీ పవన్.. తన మూడో భార్య అనా లెజ్‌నెవా ద్వారా కలిగిన సంతానాన్ని ఇలా పరిచయం చేయడం అభిమానుల్ని ఆకట్టుకుంది. ఐతే పవన్ ఇలా ఆ చిన్నారిని పరిచయం చేశాడో లేదో.. అదే సమయానికి పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇచ్చిన ఓ సంచలన ఇంటర్వ్యూ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

ఈ ఇంటర్వ్యూలో రేణు కూడా పవన్ రెండో కూతురి గురించే ప్రస్తావించింది. 11 ఏళ్లు తనతో రిలేషన్షిప్‌లో ఉన్న పవన్.. తనకు తెలియకుండానే మరో అమ్మాయితో బిడ్డను కనేశాడని వెల్లడించిన రేణు.. పవన్‌ను అభిమానించే అమ్మాయిలందరూ తన స్థానంలో ఉండి ఆలోచించమంటూ కోరింది. ఈ వ్యాఖ్యలు పెను సంచలనానికి దారి తీశాయి. మొన్ననే తాను పవన్ గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడను అని ప్రకటించిన రేణు.. ఇంతలో ఈ ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరోవైపు రేణు బీబీసీ తెలుగు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను పవన్ నుంచి ఒక్క రూపాయి కూడా భరణం కింద తీసుకోలేదని చెప్పింది. తన పిల్లలకు మాత్రం న్యాయంగా రావాల్సిన వాటా వచ్చినట్లు చెప్పింది. తాను పవన్ నుంచి విడిపోయాక అనారోగ్యం పాలై ఎంత అవస్థలు పడింది.. దాని వల్ల తన పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవించింది కూడా కూలంకషంగా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు