100 సీట్లొద్దు గాని... నీ చెల్లిని గెలిపించు కేటీఆర్‌

100 సీట్లొద్దు గాని... నీ చెల్లిని గెలిపించు కేటీఆర్‌

టీఆర్ఎస్ దూకుడుకు క‌ళ్లెం వేయ‌క‌పోతే ఇక రాష్ట్రంలో పార్టీకి భ‌విష్య‌త్తే లేద‌ని భావిస్తున్న కాంగ్రెస్‌... కొత్త ఉత్తేజంతో తెలంగాణ పావులు క‌దుపుతోంది. ప్లాన్ 1- ప‌థ‌కాలు, ప్లాన్ -2 ప్ర‌చారం, ప్లాన్ 3- ఆక‌ర్ష‌... ఇది కాంగ్రెస్‌ను చంపేయ‌డానికి కేసీఆర్ ర‌చించిన ప‌థ‌కం. కానీ చివ‌రి ద‌శ మొద‌ల‌య్యాక దీనిని గ్ర‌హించిన కాంగ్రెస్ చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అసెంబ్లీలో కోమ‌టిరెడ్డి, సంప‌త్‌ల‌పై వేసిన వేటు త‌ప్పు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కి కొత్త‌ ఉత్సాహం ఇచ్చింది. అందుకే వాళ్లు రివ‌ర్స్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

టీఆర్ఎస్‌లో తండ్రీ కొడుకుల ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీసేలా స‌వాళ్లు, విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టింది కాంగ్రెస్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వంద సీట్లు గెలుస్తామ‌ని ఇప్ప‌టికే  కేసీఆర్ ప‌దే ప‌దే చెప్పారు. దానికి మీరు గెల‌వ‌రు అనేది క‌చ్చితంగా అంత ఎఫెక్టివ్ విమ‌ర్శ కాదు. అందుకే కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి కేటీఆర్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బ‌తీసే మాట అనేశారు. *వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 100 సీట్లు గెల‌వ‌డం త‌రువాత... ముందు మీ చెల్లి  నిజామాబాద్ ఎంపీగా కవితను మ‌ళ్లీ గెలిపించుకో చాలు, నువ్వు ఆ ప‌ని చేస్తే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా* అంటూ కోమ‌టిరెడ్డి స‌వాల్ విసిరారు.

తెలంగాణలో పబ్లిసిటీ త‌ప్ప పాల‌న లేద‌ని, కేసీఆర్ ఫ్యామిలీ నియంత పాలన కొనసాగిస్తోంద‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ నేత‌ల్లో కాన్ఫిడెన్స్ నింప‌డానికి అపుడ‌పుడు సీఎం కేసీఆర్ పాజిటివ్ సర్వేలు చేసి ప‌బ్బం గ‌డుపుతున్నార‌ని అన్నారు. ప‌ల్లెకు వెళ్తే కేసీఆర్ పాల‌న బండారం బ‌య‌ట‌ప‌డుతోంద‌న్నారు. సంపత్‌కుమార్ ను, న‌న్ను అన్యాయంగా ఎమ్మెల్యే సభ్యత్వాల నుంచి తొలగించి హైకోర్టు చెప్పినా ఇంకా స‌భ్య‌త్వాలు పున‌రుద్ధ‌రించ‌లేద‌ని అన్నారు. కోర్టుల‌పై కూడా కేసీఆర్‌కు గౌర‌వం లేద‌ని, ఇలాంటి వ్య‌క్తిని మ‌ళ్లీ ప్ర‌జ‌లు ఎలా న‌మ్ముతార‌ని అనుకుంటున్నారో ఆ పార్టీ వారికే అర్థం కావాల‌న్నారు. 70-80 శాతం పూర్త‌యిన కాంగ్రెస్ హ‌యాం ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేసీఆర్ చెప్పిన దానికంటే ఎక్కువ ఎక‌రాలకు నీళ్లొస్తాయి. కానీ కాంగ్రెస్ మంచి ప‌నులు లోకానికి తెలియ‌కూడ‌ద‌ని వాటిని ప‌క్క‌న పెట్టార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇది కార్మికుల ప్ర‌భుత్వం కాదు, క‌మీష‌న్ల ప్ర‌భుత్వం అని విమ‌ర్శించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English