ఎంపీ సీట్ల‌కు చంద్ర‌బాబు, కేసీఆర్ పోటీ!

ఎంపీ సీట్ల‌కు చంద్ర‌బాబు, కేసీఆర్ పోటీ!

రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మ‌న తెలుగు ముఖ్య‌మంత్రులు తెలివైన ముఖ్య‌మంత్రుల జాబితాలో టాప్‌-5 లో ఉంటారు. అందులో మ‌రో మాట‌కు తావు లేదు. ప్రస్తుతం ఇద్ద‌రూ అధికారంలో ఉన్నారు. 2019 కూడా త‌మ‌దే అని గ‌ట్టిగా న‌మ్ముతున్నారు. కానీ... లోక్‌స‌భ సీట్ల‌కు పోటీ చేస్తున్నారు. అంత గ‌ట్టిగా న‌మ్మిన‌పుడు లోక్‌స‌భ సీట్ల‌కు పోటీ చేయ‌డం ఎందుకు డ‌బ్బులు దండ‌గ అనుకోవ‌చ్చు. కానీ ఇద్ద‌రి వెనుక అనేక విశ్లేష‌ణ‌లు ఉన్నాయి.

నిజానికి అటు చంద్ర‌బాబుకు గాని ఇటు కేసీఆర్‌కు గాని బ‌ల‌మైన శ‌త్రువులు లేరు. జ‌గ‌న్ కు యూత్ ఫాలోయింగ్ బాగానే ఉన్నా... రెండు వ‌ర్గాల‌ ఓటు బ్యాంకు సాలిడ్‌గా ఉన్నా ముఖ్య‌మంత్రి హోదాకు త‌గిన వ్య‌క్తిగా మాత్రం అత‌నిని తెలుగు ప్ర‌జ‌లు ఆద‌రించ‌లేక‌పోతున్నారు. దానికి అవ‌స‌ర‌మైన ల‌క్ష‌ణాలు జ‌గ‌న్‌కు లేవ‌ని అందుకే ఆద‌ర‌ణ బాగున్నా చివ‌ర‌కు వ‌చ్చేట‌ప్ప‌టికి ఓటు ఆలోచించడం మొద‌లుపెట్టిన‌పుడు ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌ద‌న్నది విశ్లేషణ‌. ఇక తెలంగాణ‌లో విప‌రీత‌మైన వ‌ర్గ పోరు, నేత‌ల పోరు మీద న‌మ్మ‌కంతో కేసీఆర్ గెలుపుపై ఆశ‌లు పెట్టుక‌న్నారు. మ‌రింత బ‌లం కోసం కొన్ని కొత్త ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ, ఉద్య‌మంలో కీల‌క‌నినాద‌మైన నీళ్ల‌పై కూడా శ్ర‌ద్ధ చూపుతున్నారు. మ‌రి వీరెందుకు లోక్‌స‌భ‌కు పోటీ చేస్తున్నారు? అంటే దానికి ప‌లు కార‌ణాలున్నాయి.
ఇద్ద‌రికి రాజ‌కీయ వార‌సులు ఉన్నారు. ఇరు పార్టీల్లోను వార‌సుల‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని చంద్రుల‌ను డిమాండ్ చేస్తున్నారు. ఎవ‌రికైనా పుత్రప్రేమ ఉంటుంది. పైగా పార్టీలోనే ఇద్ద‌రు మంచి పేర్లు సంపాదించుకుంటున్న నేప‌థ్యంలో వారికి అవ‌కాశం ఇచ్చే ఆలోచ‌న‌లో ఇద్ద‌రు చంద్ర‌లు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇది ఒక కార‌ణం అయితే... దీనికి మించిన కార‌ణం వారి వ‌ద్ద ఇంకోటుంది. వాస్త‌వానికి ఇరు పార్టీలు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉన్నా, ప్ర‌త్య‌ర్థులు బ‌లంగా లేక‌పోయినా రాజ‌కీయ ప‌రిణామాలు ఎవ‌రూ ఊహించ‌నివి క‌దా. ఒక‌వేళ 2019లో మోడీ కేంద్రంలో ఓడిపోతే... చ‌క్రం తిప్ప‌డానికి కేంద్రంలో ఎంపీగా ఉంటే... బాగుంటుంద‌ని భావిస్తున్నారు. ఒక‌వేళ అన్నీ కలిసొస్తే ప్రాంతీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో  ప్ర‌ధాని పద‌వి ద‌క్కే అవ‌కాశ‌మూ ఉంటుంది. అలాంటి అరుదైన అవ‌కాశం వ‌స్తే వెంట‌నే స‌ద్వినియోగం చేసుకునే అవ‌కాశం ఉండాలి క‌దా..అందుకే ఈ ముందు జాగ్ర‌త్త అని కూడా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.  అదే జ‌రిగితే కొడుకు సీఎం, నాన్న పీఎం వంటి బంప‌రాఫ‌ర్ త‌గ‌లొచ్చు.

ఇక వీళ్లు పోటీ చేసే స్థానాలు కూడా ఆస‌క్తిక‌రంగానే ఉన్నాయి. కేసీఆర్ క‌చ్చితంగా మెదక్‌పై దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. దానికి కార‌ణం అక్క‌డ ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనంగా ఉండ‌టం, త‌న ఫాంహౌస్ ఏరియాకు ద‌గ్గ‌ర కావ‌డం ఒక‌టి. ఇక చంద్ర‌బాబు విజ‌య‌వాడ ఎంపీ సీటుకు, న‌గ‌రంలోనే ఒక ఎమ్మెల్యే సీటుకు పోటీ ప‌డే అవకాశాలున్నాయి. విజ‌య‌వాడ‌కు బాబు వ‌స్తే లోకేష్ కుప్పం నుంచి పోటీ చేసే అవ‌కాశాలుంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు