పిల‌వ‌ని పేరంటానికి వెళ్లి షాకిచ్చిన ట్రంప్‌

పిల‌వ‌ని పేరంటానికి వెళ్లి షాకిచ్చిన ట్రంప్‌

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా సెన్సేషనే. నిర్ణ‌యాల నుంచి మొదుల‌కొని విధానాల వ‌ర‌కు ఆయ‌న‌దో భిన్న‌మైన శైలి. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా వెళ్తున్నారంటే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన భద్రతా సిబ్బంది ఎంతో ముందుగానే వెళ్లి ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓ పిలవని పెళ్లికి వెళ్లి ఆశ్చర్యపరిచారు. గతేడాది జూన్‌లో జ‌రిగిన విష‌యాన్ని ఇప్పుడు చెప్తున్నారా అని అనుకుంటున్నారా?  కానే కాదు..మ‌ళ్లీ అలాంటి ఘ‌ట‌నే ట్రంప్ చేశారు.

న్యూజెర్సీలోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో వీకెండ్ కు గోల్ఫ్ క్ల‌బ్ లో ఎంజాయ్ చేద్దామ‌నుకున్న ట్రంప్ ఓ విచిత్ర నిర్ణ‌యం తీసుకున్నారు. అక్క‌డ జరిగిన ఈ పెళ్లికి ఏకంగా ప్రెసిడెంటే హాజరు కావడంతో అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. ఈ సందర్భంగా వధూవరులకు ట్రంప్ శుభాకాంక్షలు చెప్పారు. వాళ్లతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. తన మరైన్ వన్ చాపర్‌లో డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్లడం విశేషం. ఆయన అక్కడికి వస్తున్నట్లు ఎవరికీ ఎలాంటి సమాచారం లేకపోవడం విశేషం. ట్రంప్ పెళ్లికి వచ్చిన ఫొటోలను అక్కడున్న అతిథులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయినా ట్రంప్ ఇలా పిలవని పెళ్లికి వెళ్లడం ఇదే తొలిసారి కాదు. నూ ఇదే గోల్ఫ్ కోర్స్‌లో జరిగిన మరో పెళ్లి వేడుకకు హాజరయ్యారు.

గ‌త ఏడాది ఇలాగే ఓ ఓ వెడ్డింగ్ రిసెప్ష‌న్ కు వెళ్లి పెళ్లికి వ‌చ్చిన గెస్టుల‌తో స‌హా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును ట్రంప్ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. వెంట‌నే పెళ్లి కూతురు ట్రంప్ ద‌గ్గ‌రికి ప‌రిగెత్తుకు వ‌చ్చి... కౌగిలించుకొని ఓ ముద్దిచ్చింది. అనంత‌రం ట్రంప్ పెళ్లి కూతురు తో ఫోటోల‌కు పోజిచ్చారు. త‌ర్వాత‌.. పెళ్లి కొడుకు, పెళ్లి కూత‌రు పేర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటూ చెప్పి అక్క‌డున్న వాళ్ల‌కు చేతులూపి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అదే రీతిలో తాజాగా మ‌రోమారు ట్రంప్ ట్విస్ట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు