నాగ‌బాబుపై తీవ్రంగా మండిప‌డ్డ క‌త్తి

నాగ‌బాబుపై తీవ్రంగా మండిప‌డ్డ క‌త్తి

నాకు వాక్ స్వాతంత్య్రం ఉంది. నేను నా హ‌క్కుల కోసం పోరాడుతున్నా. నా వాక్ స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తున్నానని చెప్పే క‌త్తి మ‌హేశ్‌.. త‌న‌కు తోచిన‌ట్లుగా మాట‌లు అనేయ‌టం తెలిసిందే. ఒక టీవీ ఛాన‌ల్ కు ఇచ్చిన ఫోన్ ఇన్ లో శ్రీ‌రాముడిపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి.

శ్రీ‌రాముడిపై క‌త్తి మ‌హేశ్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల్ని చేసి కేసు ఎదుర్కొంటున్న ఆయ‌న‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా క‌త్తి మ‌హేశ్ ను ఉద్దేశించి నీచుడన్న మాట‌ను వాడారు. దీనిపై క‌త్తి మ‌హేశ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. న‌న్నునీచుడంటారా? అంటూ నాగ‌బాబుపై ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

నాగ‌బాబుపై నిప్పులు చెరిగిన క‌త్తి మ‌హేశ్ ఒక వీడియోను విడుద‌ల చేశారు. అందులో క‌త్తి మ‌హేశ్‌చేసిన వ్యాఖ్య‌ల్ని య‌థాత‌ధంగా చూస్తే..

"నా పేరు కూడా ఉచ్ఛరించకుండా నన్ను నీచుడిగా సంభోదిస్తూ నాగ‌బాబు చేసిన వీడియో నేను చూశాను. నాకు జాలి కలిగింది. నేనా నీచుడినా? అంత నీచానికి ఏం పాల్పడ్డానని ప్రశ్నించారు. ఒక అన్నకు తమ్ముడిగా.. ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్థిత్వం లేని మీరు నాగురించి మాట్లాడుతున్నారు. న‌న్ను నీచుడు అంటున్నారు"

"మీ ఫ్యామిలీ రామ భక్తులా? జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకొని వేరే పార్టీలో కలవడం. జబర్ధస్ట్‌లాంటి షోలో జడ్జ్‌గా కుర్చోని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ ఉండటం ఇది మీ కాంట్రిబ్యూషన్‌ సొసైటీ. మీరు హిందువులు"

"మీరు హిందువు.. ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీ ఎంత బాగా పట్టుదలతో ఉంటారనేది మాకందరికీ బాగా తెలుసు. నేను సాధార‌ణంగా మ‌నుషుల గురించి.. వారి వ్య‌క్తిత్వాల గురించి మాట్లాడ‌ను.  నీచుడు అంటూ నన్ను ఒక దళితున్ని సంభోదించారు ఎంత అహంకారముంటే ఇలా చేస్తారోనని అర్థమవుతోంది. సెక్యులర్‌ హిందువులు ఎక్కడి నుంచి వచ్చారు? దళితుల మీద దాడి జరుగుతున్నపుడు మీరంతా నోరెందుకు మెదపలేదు"

"ముస్లింపై దాడి జరిగినపుడు మీరంతా ఏం చేస్తున్నారు? నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను. నా వాక్‌స్వాతంత్రం, భావాప్రకటన స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నాను మీ ఫ్యామీలీ, మీ అన్నదమ్ముల గురించి నేను మాట్లాడితే మీరు తట్టుకోవడం కష్టం. మీరు నాకు బెదిరింపులు ఇస్తారా. నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నా మీద చేయి పడితే మీరు.. ఆర్ ఎస్ ఎస్‌.. వీహెచ్ పీ..బీజేపీ.. ప‌రిపూర్ణ‌నంద స్వామిలు బాధ్యత వహిస్తారు"

"నేను చెప్పిందేంటో అర్ధం కానీ మీరు నాకు వార్నింగ్‌ ఇస్తారా.. ఇదే పంథా మీరు కొనసాగించండీ.. మీ రాజకీయ, సినిమా జీవితం ఎంత దౌర్భాగ్యమో అందరికీ వెలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుంది. మీ సామాజిక ప‌త‌నానికి మీరే పునాది త‌వ్వుకుంటున్నారు. మీరు మీ హ‌ద్దుల్లోఉంటే మంచిది"

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు