ట్రంప్ మైండ్ బ్లాంక‌య్యే నిర‌స‌న అంటే ఇదే

ట్రంప్ మైండ్ బ్లాంక‌య్యే నిర‌స‌న అంటే ఇదే

అగ్ర‌రాజ్యం అమెరికా మైండ్ బ్లాంక‌య్యే నిర‌స‌న ఇది. అమెరికా అంతా అవాక్క‌య్యే  ఘ‌ట‌న ఆ దేశ స్వాతంత్ర్య దినోత్స‌వ సంబురాల సంద‌ర్భంగా చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే...అమెరికా అనగానే గుర్తొచ్చేది స్టాచూ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి చిహ్నంగా కనిపించే ఈ భారీ విగ్రహం న్యూయార్క్ హార్బర్ దగ్గర ఉంటుంది. ఏటా ఈ స్టాచూ ఆఫ్ లిబర్టీని చూడటానికే ప్రపంచం నలుమూలల నుంచి లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. అలాంటి పర్యాటక స్థలాన్ని బుధవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మూసివేశారు. దీనికి కారణం ట్రంప్ తీరుతో హ‌ర్ట‌యిన ఓ మ‌హిళ!

అమెరికా అధ్య‌క్షుడి తీరు కార‌ణంగా మ‌హిళ హ‌ర్ట‌వ‌డం ఏంటి? అందుకు ఏకంగా అమెరికా అంటేనే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే విగ్ర‌హాన్ని కూల్చివేయ‌డం ఎందుక‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?ఈ మధ్యే మెక్సికో, అమెరికా సరిహద్దులో అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న కుటుంబాల నుంచి తల్లీపిల్లలను వేరు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలుసు కదా. దీనికి వ్యతిరేకంగా ఓ గ్రూప్ నిరసన తెలిపింది.  రైజ్ అండ్ రెసిస్ట్ గ్రూప్ ఇలా ఆందోళ‌న చేస్తోంది. ఈ గ్రూప్‌న‌కు చెందిన మ‌హిళ అని భావిస్తున్న ఓ మహిళ ఆ స్టాచూపైకి ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో ఒక్క‌సారిగా క‌ల‌వ‌రం చోటుచేసుకుంది. ఆ మహిళ స్టాచూపైకి ఎక్కడానికి ప్రయత్నించడంతో తాత్కాలికంగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు మూడు గంటలపాటు కష్టపడి ఆమెను కిందికి తీసుకురాగలిగారు. అనంత‌రం ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే స్టాచూ కింద నిరసన తెలిపిన రైజ్ అండ్ రెసిస్ట్ గ్రూప్ తర్వాత మాట్లాడుతూ.. ఆ మహిళ తమ గ్రూప్‌కు చెందిన వ్యక్తి కాదని స్పష్టంచేసింది. స్టాచూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 91 మీటర్లు. 1886 నుంచి ఇది ఇక్కడ కొలువుదీరింది.ట్రంప్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండ‌టం..స్వ‌తంత్ర సంబురాల సంద‌ర్భంగానే ఆ విగ్ర‌హాన్ని మూసివేయ‌డం ఆస‌క్తిక‌రం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు