అందుకే ఆ 11 మంది అలా చ‌నిపోయార‌ట‌!

అందుకే ఆ 11 మంది అలా చ‌నిపోయార‌ట‌!

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ సామూహిక మ‌ర‌ణాల ఉదంతంలో చిక్కుముడులు ఒక్కొక్క‌టిగా వీడిపోతున్నాయి. వారిని ఎవ‌రో చంప‌లేద‌ని..వారికి వారే చంపేసుకున్నార‌న్న వాద‌న విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డుతోంది. ప‌ద‌కొండు మంది ఒకేలా మ‌ర‌ణించ‌టానికి కార‌ణం ఇంటిపెద్ద అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. షాకింగ్ అంశం ఏమిటంటే.. ఆ ఇంటి పెద్ద అప్పుడెప్పుడో చ‌నిపోయిన వ్య‌క్తి కావ‌టం.

వ‌ట‌వృక్ష పూజ‌లో భాగంగా వారంతా మ‌ర్రిచెట్టు ఊడ‌ల్లాగా ఉరికి వేలాడారు. ఇందుకు సంబంధించిన వివ‌రాలు రెండు పుస్త‌కాల్లో వివ‌రంగా ల‌భించాయి. అప్పుడెప్పుడో చ‌నిపోయిన ఆ ఇంటి య‌జ‌మాని క‌ల‌లో క‌నిపించి మోక్షం గురించి చెప్ప‌టం వ‌ల్లే ఈ దారుణం చోటు చేసుకుంద‌న్న మాట వారింట్లో ల‌భ్య‌మైన పుస్త‌కాలు వెల్ల‌డించిన‌ట్లుగా చెబుతున్నారు.

నారాయ‌ణ్ దేవి.. ఆమె ఇద్ద‌రు కుమారులు భావ్నేశ్ భాటియా.. ల‌లిత్ భాటియా..క‌మార్తెల‌తో పాటు వారి కుటుంబ స‌భ్యులంతా అర్థ‌రాత్రి దాటిన త‌ర్వాత ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌టం సంచ‌లంగా మారిన వైనం తెలిసిందే.  గ‌డిచిన మూడేళ్లుగా ల‌లిత్ భాటియా వ‌ట వృక్ష పూజ గురించి ప‌లుమార్లు ప్ర‌స్తావించిన పుస్త‌కం తాజాగా ల‌భించింది.  

మోక్షానికి ముహుర్తాన్ని జూన్ 25గా నిర్ణ‌యించుకొని ఆ వివ‌రాల్ని న‌మోదు చేశారు. గ‌తంలో మ‌ర‌ణించిన త‌న తండ్రి క‌ల‌లో క‌నిపించి.. ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ల‌లిత్ భాటియా న‌డుచుకున్న‌ట్లుగా పుస్త‌కాల్లో రాసిన రాత‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని అధికారులు వెల్ల‌డిస్తున్నారు.  దీంతో.. ల‌లిత్ భాటియాకు భ్రాంతికి సంబంధించిన మాన‌సిక రుగ్మ‌త ఉన్న‌ట్లు భావిస్తున్నారు. త‌న‌కున్న భ్రాంతిని కుటుంబ స‌భ్యుల‌కు అల‌వాటు చేసిన ఆయ‌న సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపించి.. పూర్తిచేసి ఉంటార‌ని భావిస్తున్నారు.

చింత వ‌ద్దు చింత‌న చేయండంటూ ల‌లిత్ ఒక చోటు రాసుకోవ‌టం గ‌మ‌నార్హం. సామూహిక ఆత్మ‌హ‌త్య‌ల‌కు ముందు ప‌క్కా రిహార్స‌ల్ కూడా నిర్వ‌హించి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అంతేకాదు.. ఈ ప్ర‌క్రియ జ‌రిగేట‌ప్పుడు ఫోన్ల‌ను సైలెంట్ మోడ్ లో పెట్టుకోవ‌టం.. వాటికి టేప్ చుట్టి సొరుగులో దాచి ఉండ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు