పళ్లంరాజుకు ఆ విషయంలో ఎందుకంత ఇంట్రెస్టు?

పళ్లంరాజుకు ఆ విషయంలో ఎందుకంత ఇంట్రెస్టు?

ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్‌ పునరుజ్జీవం కోసం చేపడుతున్న ప్రయత్నాలు ఇతర పార్టీలకు అర్థం కావడం లేదు. సొంత పార్టీ మళ్లీ రమ్మంటున్నా బెట్టు చేస్తున్న నేతలను ఆ పార్టీ గడ్డం పట్టి బతిమాలుతుండడం నవ్వులపాలవుతోంది. గత ఎన్నికల్లో ఒక్క స్థానం మినహా అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయిన ఆ పార్టీ ఆ తరువాత జనంలోకి వెళ్లలేకపోయింది. గత నాలుగేళ్ళుగా ఆ పార్టీ కనీసం ప్రజా సమస్యలపైనా గట్టిగా పోరాడలేకపోయింది. నేతలంతా కాడి పక్కన పడేశారు. దీంతో ఆ పార్టీ ఇప్పుడు ముసుగుతన్నిపడుకున్న నేతల ముఖాలపై నీళ్లు చల్లి మళ్లీ పార్టీని దారిలో పెట్టాలని ప్రయత్నిస్తోంది.  గతంలో ఆ పార్టీలో పని చేసిన కీలకనాయకుల్ని బ్రతిమలాడో.. లేక బామాలో తిరిగి సొంతగూటికి రప్పించే యత్నం జరుగుతోంది.

ఇందులో భాగంగానే... సుమారు నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌ కుమార్‌రెడ్డిని కూడా ఇలాగే సొంతగూటికి రమ్మంటూ పార్టీ ఆహ్వానించింది. కిరణ్ ను మళ్లీ కాంగ్రెస్‌లో చేర్చడంపై మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు చూపిస్తున్న శ్రద్ధ కూడా ఎవరికీ అర్థం కావడం లేదట. స్వయంగా కిరణ్‌కుమార్‌రెడ్డివద్దకెళ్ళి కాంగ్రెస్‌లో తిరిగి చేరడంతో పాటు ఉత్సాహంగా పని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేసొచ్చారు. దీనిపై అవునని గాని, కాదనిగాని కిరణ్‌కుమార్‌ బదులివ్వలేదు. పైగా అధిష్టానంతో మాట్లాడి నిర్ణయం ప్రక టిస్తానన్నారు. అప్పట్నుంచి పళ్ళంరాజు కిరణ్‌పై ఒత్తిడి పెంచారు. ఇతర నాయకుల మాటెలా ఉన్నా కిరణ్‌ విష యంలో పళ్ళంరాజు తీసు కుంటున్న అతిశ్రద్ద పురా తన కాంగ్రెస్‌ వాదులకే కాదు.. రాష్ట్రప్రజలక్కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.
     కిరణ్‌, పళ్ళంరాజు ఇద్దరూ హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్లో క్లాస్‌మేట్స్‌. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యముంది. కిరణ్‌ ముఖ్య మంత్రిగా ఉంటే అదే సమయంలో పళ్ళం రాజు కేంద్రంలో కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు. ఇద్దరూ కూడా కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల్లో ఆరితేరిన వారే. కిరణ్‌ సిఎమ్‌గా ఉన్న సమయంలో పళ్ళంరాజుకు చాలా ప్రాధాన్యతనిచ్చారు. అయినంతమాత్రాన కిరణ్‌ను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు ఆయనింతగా ప్రయత్నం చేయాల్సిన అవసర మేమన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతు న్నాయి. ఆ మాటకొస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గతంలో ఎప్పుడూ ఇంతటి దీనావస్థకు గురికాలేదు. కిరణ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్‌కు ఇంతటి దుర్గతి పట్టింది.  విభజన సమయంలో ఆయన అధిష్టాన వైఖరిని వ్యతిరేకిస్తూనే అధికారాన్ని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ధైర్యంగా రాజీనామా చేసి కేంద్ర చర్యకు తన నిరసనను వ్యక్తం చేయలేదు. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి తనకు నచ్చినట్లుగా విభజించేసింది. ఏపీ ప్రజలకు కిరణ్ పై ఈ విషయంలో ఆగ్రహం ఉంది.  ఇలాంటి దశలో కిరణ్‌‌ను ఎలాగైనా కాంగ్రెస్ లోకి తేవాలని పళ్లంరాజు ఎందుకంత ట్రై చేస్తున్నారో అర్థం కావడం లేదని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు