జ‌గ‌న్ సీటు ఇచ్చినా, ఇవ్వ‌కున్నా... 'కత్తి' పోటీ

జ‌గ‌న్ సీటు ఇచ్చినా, ఇవ్వ‌కున్నా...  'కత్తి' పోటీ

కత్తి మ‌హేశ్... కొంత‌కాలం క్రితం జ‌నాల‌కు పెద్ద‌గా తెలియ‌ని పేరే. అయితే స్టార్ మా టీవీలో  ప్ర‌సార‌మైన బిగ్ బాస్ తొలి సీజన్‌లో పార్టిసిపెంట్‌గా ఎంపికై... ఆ త‌ర్వాత టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో నేరుగా యుద్ధానికి దిగేసి, ఆ త‌ర్వాత ప‌లు అంశాల‌పై త‌న‌దైన శైలిలో కామెంట్లు ఇచ్చేస్తున్న  టాలీవుడ్ సినీ  క్రిటిక్‌ క‌త్తి  మ‌హేశ్ కు ఇప్పుడు పెద్ద‌గా ఇంట్ర‌డ‌క్ష‌నే అవ‌స‌రం లేదు. ఎందుకంటే... ఇప్పుడు క‌త్తి మ‌హేశ్ అన‌గానే తెలుగు ప్ర‌జ‌ల క‌ళ్ల ముందు ఓ గ‌డ్డం వ్య‌క్తి ప్ర‌త్యక్ష‌మైపోతాడు. ఇటీవ‌లే రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన క‌త్తి మ‌హేశ్ పై ఇప్పుడు ఏకంగా పోలీసు కేసులే న‌మోదైపోయాయి.

అయినా ఇప్పుడు క‌త్తి మ‌హేశ్ గురించి ఎందుకంటారా?... ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ట్విట్ట‌ర్ వార్‌కు దిగ‌డంతోనే స‌రిపెట్టుకోకుండా ప‌లు సామాజికాంశాల‌పై త‌న‌దైన రీతిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న క‌త్తి మ‌హేశ్‌... త్వ‌ర‌లోనే రాజ‌కీయ తెరంగేట్రం చేస్తార‌ని చాలా రోజుల నుంచి ప్రచారంలో ఉన్న మాటే. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు ఈ మాట‌పై దాట‌వేత ధోర‌ణితోనే సాగిన క‌త్తి మ‌హేశ్ చిట్ట‌చివ‌ర‌కు త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేశారు. రాజ‌కీయాల‌పై త‌న‌కు ఆస‌క్తి ఉంద‌ని, వ‌చ్చే ఎన్నికల్లో అవ‌కాశం చిక్కితే  ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగేస్తాన‌ని కూడా ఆయ‌న ఏమాత్రం మొహ‌మాటం లేకుండానే ప్ర‌క‌టిచేసుకున్నారు. తొలి ప్ర‌క‌ట‌న‌లోనే క‌త్తి  మ‌హేశ్ చాలా అంశాల‌నే వెల్లడించేశారు. చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు చెందిన క‌త్తి మ‌హేశ్‌... త‌న జిల్లాలోని చిత్తూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతానంటూ ఓ పెద్ద స్టేట్ మెంటే ఇచ్చేశారు.

అంత‌టితో ఆగితే బాగుండేదేమో... విప‌క్ష  వైసీపీలో చేర‌తాన‌ని, ఆ  పార్టీ టికెట్ పైనే చిత్తూరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ ఎంపీ స్థానం నుంచి బ‌రిలోకి దిగుతాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో చ‌ర్చించేందుకు త్వ‌ర‌లోనే  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  వ‌ద్ద‌కు వెళ‌తాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదంతా బాగానే ఉన్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... ఏదో ఒక అంశంపై విమ‌ర్శ‌లు చేయ‌నిదే పూట  గ‌డ‌వ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న క‌త్తి మ‌హేశ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా? అన్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. జ‌గ‌న్ సీటు ఇచ్చినా, ఇవ్వ‌కున్నా... త‌న తాజా ప్ర‌క‌ట‌న‌తో క‌త్తి మ‌హేశ్ తెలుగు ప్ర‌జ‌ల  దృష్టిని త‌నవైపున‌కు తిప్పేసుకున్నార‌ని చెప్పాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు