జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను ప‌ట్టుకురండి.. మ‌ళ్లీ బీజేపీ వ‌స్తుంది

జేడీఎస్ ఎమ్మెల్యేల‌ను ప‌ట్టుకురండి.. మ‌ళ్లీ బీజేపీ వ‌స్తుంది

ఇప్పుడిప్పుడు కుదురుకుంటున్న‌ట్లుగా క‌నిపించిన క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కింది. కాంగ్రెస్‌.. జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారు క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్రంలో బీజేపీ ప‌వ‌ర్లోకి వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న‌ట్లుగా మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జ‌లు బీజేపీ ప్ర‌భుత్వాన్ని కోరుకుంటున్నార‌ని.. కాంగ్రెస్‌.. జేడీఎస్ పార్టీల్లోని ఎమ్మెల్యేల ఇళ్ల‌కు వెళ్లాల‌ని.. ఆ పార్టీల్లోని అసంతృప్తుల్ని పార్టీలోకి తీసుకురావాలంటూ క్యాడ‌ర్ ను ఆదేశించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ క‌మిటీ స‌మావేశంలో ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.

అధికారంలోకి వ‌స్తామ‌న్న ఆశ‌తో ప్ర‌జ‌లు ఉన్నార‌ని.. వ‌చ్చే ఏడాది జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోడీని ప్ర‌ధాని కుర్చీలో మ‌రోసారి కూర్చోబెట్టాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్న య‌డ్డీ.. వెళ్లి.. కాంగ్రెస్‌.. జేడీఎస్ ల‌లోని అసంతృప్త ఎమ్మెల్యేల ఇళ్ల‌కు వెళ్లి మ‌రీ బీజేపీలోకి తీసుకురావాల‌ని వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు రాష్ట్రంలోని సంకీర్ణ ప్ర‌భుత్వం విష‌యంలో తాము చాలా స‌హ‌నంగా ఉన్నామ‌ని.. ఆ ప్ర‌భుత్వం ప‌డిపోవాల‌ని తాను అనుకోవ‌టం లేదంటూనే.. య‌డ్డీ కాంగ్రెస్‌.. జేడీఎస్ ఎమ్మెల్యేల‌కు గాలం వేయ‌టం.. ఓపెన్ గా పార్టీ నేత‌ల‌కు చెప్ప‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు