మాకు తల్లి పాత్రలు.. వాళ్లకి రొమాన్సులా??

మాకు తల్లి పాత్రలు.. వాళ్లకి రొమాన్సులా??

90 ల కాలంలో మనీషా కొయిరాలా ప్రేక్షకుల మనసులో దేవత. ఆమె అందానికి బానిస అవ్వనివారు లేరేమో. దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ఈమె కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. చాలా ఏళ్ళ తరువాత ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. డియర్ మాయ మరియు లస్ట్ స్టోరీస్ వంటి సినిమాలలో నటించింది. ఇప్పుడు సంజు సినిమాలో సంజయ్ దత్ (సినిమాలో రణబీర్ కపూర్) తల్లిగా మనముందుకు రాబోతోంది. ఇంకా చాలానే పెద్ద సినిమాలు లైన్లో పెట్టిన ఈమె తనకి వస్తున్న పాత్రల గురించి ఒక కామెంట్ చేసింది.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు తల్లి పాత్రలే వస్తున్నాయంటూ దిగులు చెందుతోంది. "మాలో కొంతమంది పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ నుండి కొంచెం పక్కకి తప్పుకుని మళ్ళీతిరిగి వచ్చాము. మేం నటించిన సినిమాలలో హీరోలు మాత్రం ఆపకుండా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. నిజాయితీ గా మాట్లాడుకుంటే ఆ హీరోలు ఇప్పటికీ 20 ఏళ్ళ అమ్మాయిలను హీరోయిన్లుగా పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు కానీ మేముమాత్రం 40 దాటగానే తల్లి పాత్రలకే పరిమితమయిపోతున్నాం. ఇది నేను ఎప్పటికి అర్థంచేసుకోలేక పోతున్నాను" అంటూ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది.

ఈమధ్యనే లస్ట్ స్టోరీస్ అనే వెబ్ ఫిలిం లో భర్త ఫ్రెండ్ తో సంబంధం పెట్టుకునే ఒక భార్యగా నటించింది మనిషా కొయిరాలా. ఇలాంటి బోల్డ్ పాత్ర గురించి మాట్లాడుతూ "ఇప్పటి జనరేషన్లో గొప్ప విషయం ఏంటంటే నన్నెవరూ నా మొహం మీద ముడతల గురించి ఆరా తీయలేదు. అవి వయసులో కామనే అని వాళ్ళు అర్థంచేసుకున్నారు. ఇది ఒక మంచి స్టార్ట్" అని వెల్లడించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు