కండోమ్స్ ట్వీట్ తో హాట్ టాపిక్ అయ్యిందిగా!

కండోమ్స్ ట్వీట్ తో హాట్ టాపిక్ అయ్యిందిగా!

ఎప్పుడేం చేయాలో అదే చేయాలి. అలాంటి రూల్స్ ను బ్రేక్ చేస్తూ సోష‌ల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ స్టేట‌స్‌ను సొంతం చేసుకునే బ్యాచ్ ఒక‌టి ఉంటుంది. తాము ఫ‌లానా రంగానికి అని చెప్పినా.. వారికి ఆ రంగంలో ఎలాంటి అవ‌కాశాలు రావు. కానీ.. ఆ పేరిట వారు చేసే హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇలాంటి వారు ఎవ‌రుంటార‌బ్బా అంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం.

పూన‌మ్ పాండే ముచ్చ‌టే చూడండి. బాలీవుడ్ లో అమ్మ‌డికి ద‌క్కే అవ‌కాశాలెన్నో తెలిసిందే. మోడ‌ల్ గా ఆమె ఏ మాత్రం బిజీ కాదు. కానీ.. స్టార్ హీరోయిన్ల కంటే మిన్న‌గా వివాదాల్లో ఆమె ఎప్పుడూ అంద‌రికంటే ముందుంటారు. వార్త‌ల్లో వెలిగిపోయి జ‌నం నోళ్ల‌ల్లో నిత్యం నానుతుంటారు. ఇలాంటి వారికి ఫ‌లానా ఇష్యూ అన్న‌ది అక్క‌ర్లేదు. ఏ విష‌యం మీద‌నైనా స‌రే.. మేమున్నాం అన్న‌ట్లుగా పోస్టుల‌తో తెర మీద‌కు వ‌చ్చేస్తుంటారు.

మ‌హారాష్ట్రలో ప్లాస్టిక్ మీద బ్యాన్ విధించారు. అంతే.. పూన‌మ్ పాండేకు కొత్త ఐడియా వ‌చ్చేసింది. ఏ మాట‌ను తాను ట్వీట్ చేస్తే.. అది వైర‌ల్ అవుతుందో బాగా తెలిసిన ముద్దుగుమ్మ‌.. బ్యాన్ చేసే ఫ్లాస్టిక్ ఐటెమ్స్ లో కండోమ్స్ కూడా ఉంటాయా? అంటూ అమాయ‌కంగా అడిగేసింది. ఇంకేముంది?.. అమ్మ‌డి ట్వీట్ అదిరిందంటూ కొంత‌మంది ఉత్సాహ‌ప‌రిస్తే.. నీవింతే.. నువ్వు మార‌వ‌న్న‌ట్లుగా మ‌రికొంద‌రు.

మొత్తానికి అమ్మ‌డి ట్వీట్ వైర‌ల్ అయ్యింది. పూన‌మ్ ఏం కోరుకుందో అది జ‌రిగిపోయింది. ఇప్పుడే కాదు.. ఆ మ‌ధ్య‌న కూడా పూన‌మ్ త‌న‌దైన స్టైల్లో ట్వీట్ చేసింది. ఫ్లాస్టిక్ ను నిషేధించారు.. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ చేయించుకున్నోళ్లు వీధుల్లో తిర‌గ‌మాకండంటూ ట్వీట్ చేసి హ‌డావుడి చేసింది. అమ్మ‌డి చిట్టి బుర్ర‌లో చిలిపి ట్వీట్లు ట‌న్నులు ట‌న్నులు ఉంటాయి. అవే అమ్మ‌డిని సోష‌ల్ మీడియాలో వెలిగిపోయేలా చేస్తున్నాయని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English