మోడీకి పంచ్ ఇచ్చిన రాందేవ్ బాబా!

మోడీకి పంచ్ ఇచ్చిన రాందేవ్ బాబా!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. అందునా రాజ‌కీయాలు అస్స‌లు ఒక్క‌టిలా ఉండ‌వు. అప్ప‌టివ‌ర‌కూ రాసుకుపూసుకు తిరిగినోళ్లు సైతం క‌త్తులు దూసుకోవ‌టం క‌నిపిస్తుంది. ఏ బంధం ఎంత‌కాలం కొన‌సాగుతుంద‌న్న విష‌యంలో అంచ‌నాల‌కు అతీతంగా ఉండే రంగం ఏదైనా ఉందంటే అది రాజ‌కీయ రంగమే.

ఎక్క‌డిదాకానో ఎందుకు? 2014లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ ఎన్నిక‌ల్లో మోడీ గెలుపు కోసం అవిశ్రాంతంగా క‌ష్ట‌ప‌డి ప్ర‌చారం చేసిన వారిలో పతంజ‌లి రాందేవ్ బాబా ఒక‌రు. వ్యాపారం చేసుకునే యోగా గురువు రాజ‌కీయాలు మాట్లాడ‌టం ఏమిటి?  మోడీకి  ఓటు వేయాలంటూ ప్ర‌చారం చేయ‌టం ఏమిటి? అంటూ ప‌లువురు త‌ప్పు ప‌ట్టినా.. తానేం అనుకున్నారో అదే ప్ర‌చారం చేశారు. విమ‌ర్శ‌ల్ని లెక్క చేయ‌లేదు.

నాలుగేళ్లు గ‌డిచే స‌రికి మిగిలిన వారికి మాదిరే రాందేవ్ బాబా మాట‌లోనూ తేడా వ‌చ్చేసింది. ముంద‌స్తు విష‌యంపై మహా జోరుగా అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్న‌వేళ‌.. రాందేవ్ బాబా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి క‌ష్టాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌న్నారు. యోగా శిక్ష‌ణ ఇచ్చేందుకు లండ‌న్ కు వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డ మాట్లాడుతూ మోడీ బ్యాచ్ కు
ఎన్నిక‌ల్లో గెలుపు క‌ష్టాలు త‌ప్ప‌వ‌న్న విష‌యాన్ని కుండ బ‌ద్ధ‌లు కొట్టేశారు.
దేశంలోని ఓబీసీలు.. ద‌ళితులు.. ముస్లింలు ఏక‌మైతే వారంద‌రిని క‌లిసి క‌ట్టడి చేయ‌టం అంత తేలికైన విష‌యం కాద‌న్నారు. అంద‌రిని క‌లిసి ఎదుర్కోవ‌టం క‌ష్ట‌మ‌న్న రాందేవ్ బాబా.. ఎవ‌రైనా ప్ర‌ధాని కావొచ్చ‌న్నారు.

దేశ ప్ర‌జ‌లు ఎవ‌రిని కోరుకుంటే వారినే ప్ర‌ధానిని చేస్తార‌న్న ఆయ‌న‌.. అంద‌రూ క‌లిస్తే మాత్రం బీజేపీకి గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌న్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు