చ‌క‌చ‌కా తండ్రీ కొడుకులకు అపాయింట్‌మెంట్

చ‌క‌చ‌కా తండ్రీ కొడుకులకు అపాయింట్‌మెంట్

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. ఓ వైపు కేంద్రం ప‌నితీరుపై విమ‌ర్శ‌లు చేస్తూనే మ‌రోవైపు...కేంద్రంతో స‌త్సంబంధాల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అంతేకాకుండా త‌మ రాష్ట్రానికి ద‌క్కాల్సిన విష‌యంలో నిధుల విష‌యంలో జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.  ఈనెల 15న ప్రధానిని కేసీఆర్ కలిసిన సంగ‌తి తెలిసిందే.

విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు మోడీకి అందశారు. అయితే వీటి విష‌యంలో మ‌రింత స‌మాచారం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ కోరిన‌ట్లు స‌మాచారం. అయితే ఆ ప్ర‌తిపాద‌న విష‌యంలో ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు.  ఈ స‌మావేశానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియా సీఎం కేసీఆర్ కావ‌డం గ‌మ‌నార్హం. విభజన చట్టంలోని హామీలు సహా పలు అంశాలను ముఖ్య‌మంత్రి కేటీఆర్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి వాటి ప‌రిష్కారం చూపాల‌ని కోర‌గా....త‌న‌కు వివ‌రాలు ఇవ్వాల‌ని మోడీ పేర్కొన్నారు. దీంతో కేవ‌లం ప‌దిరోజుల వ్య‌వ‌ధిలోనే వాటిని సిద్ధం చేసి తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌తో వాటిని అందజేయించారు.

ఇదిలాఉండ‌గా... ప్ర‌ధాన‌మంత్రితో సమావేశమనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరామన్నారు. కేంద్ర ప్రభుత్వ హామీలు, 10 ప్రతిపాదనలను ప్రధాని ముందు ఉంచినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.  విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏర్పాటు చేయాలని ఈ నెల 15న సీఎం కేసీఆర్ ప్రధానికి విజ్ఞప్తి చేశార‌ని వివ‌రించారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం అంశంలో ప్రధాని మరింత సమాచారం అడగ‌టంతో ఈ విషయంలో ప్రధానికి నివేదిక అందజేసినట్లు తెలిపారు. ఐటీఐఆర్ ఏర్పాటును వేగవంతం చేయాలని ప్రధాని మోడీని కోరామని తెలిపారు. ఐటీఐఆర్‌కు కేంద్రం సహకరిస్తే మరింత వేగంగా ముందుకెళ్తామని ప్రధానికి తెలిపామన్నారు. ఐటీఐఆర్‌కు మౌలిక వసతులు కల్పించాలని కోరినట్లు చెప్పారు. హామీల విషయంలో చొరవ తీసుకుని పరిష్కరించాలని కోరినట్లు పేర్కొన్నారు.

కొస‌మెరుపు - మీటింగ్ స్క్క్రిప్టు బానే ఉంది గాని... మోడీ ఇంత చ‌క‌చ‌కా తండ్రీ కొడుకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డం చూస్తుంటే ప్ర‌జా ఫ్రంట్‌పై అనేక అనుమానాలు క‌లుగుతున్నాయి జ‌నాల‌కు. అయితే, ఈ విష‌యం గ్ర‌హించ‌ని కేటీఆర్ క‌లిస్తే ఏవేవో వార్త‌లు రాస్తార‌ని... ఈ రెండు విష‌యాల‌పై క‌లుస్తున్నాను అని ముందే ట్వీట్ పెట్టాడు. అస‌లు అనుమానాల‌కు ఇదే కార‌ణ‌మైంది. చిత్రంగా... చంద్ర‌బాబుతో ప్రాంతీయ పార్టీలు దేశ వ్యాప్తంగా జ‌త‌క‌ట్టిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్ ప్ర‌జా ఫ్రంట్ చ‌ల్ల‌బడింది. దీన్ని బ‌ట్టి కాంగ్రెస్ ఆరోపించిన‌ట్టు... ప్ర‌జాఫ్రంట్ మోడీ ఇన్‌డైరెక్ట్ ఫ్రంట్ అనుకోవాలా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు