రేపు విజ‌య‌వాడ‌కు కేసీఆర్ !

రేపు విజ‌య‌వాడ‌కు కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్లు, భ‌క్తి ఎక్కువ‌న్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ వ‌స్తే అనేక మొక్కులు చెల్లిస్తాన‌ని గ‌తంలో ఆయ‌న మొక్కుకున్నారు. అదే త‌ర‌హాలో తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో .....తెలంగాణ రావాల‌ని కోరుకుంటూ.... విజ‌య‌వాడ‌లో ఉన్న క‌న‌క‌దుర్గ అమ్మవారికి మొక్కుకున్నారు. త‌న కోరిక ఫ‌లించి ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నేప‌థ్యంలోనే ఆ మొక్కు తీర్చుకునేందుకు  కేసీఆర్ ...గురువారం నాడు విజ‌య‌వాడ వెళ్ల‌నున్నారు.

తెలంగాణ వ‌స్తే...క‌న‌దుర్గ‌మ్మ‌కు ముక్కుపుడ‌క స‌మ‌ర్పించుకుంటాన‌ని కేసీఆర్ మొక్కుకున్నారు. గురువారం ఉద‌యం కుటుంబ స‌భ్యుల‌తో పాటు కేసీఆర్ విజ‌య‌వాడ‌కు చేరుకుంటారు. రేపు మ‌ధ్యాహ్నం 12.30 నిమిషాల‌కు ఇంద్ర‌కీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్ర‌త్యేక పూజుల నిర్వ‌హించిన అనంత‌రం ముక్కుపుడ‌క స‌మ‌ర్పించ‌నున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అమ్మవారికి ముక్కుపుడ‌క‌ను కేసీఆర్ త‌యారు చేయించారు.

వాస్త‌వానికి ఈ మొక్కును ఈ ఏడాది డిసెంబ‌రులో చెల్లించాల‌ని కేసీఆర్ భావించారు.అయితే, అక్టోబ‌రులోనే ముందుస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ధాని మోదీ యోచిస్తున్నార‌న్న నేప‌థ్యంలో కేసీఆర్ హ‌ఠాత్తుగా ఈ మొక్కు చెల్లించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతోపాటు, తెలంగాణ‌లో కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావిస్తున్న నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

గ‌తంలో విజ‌య‌వాడ వ‌చ్చిన సంద‌ర్భంగా స‌మ‌యాభావం వ‌ల్ల మొక్కు తీర్చ‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో....ప్ర‌త్యేకంగా కేసీఆర్ స‌మ‌యం  కేటాయించి మొక్కు చెల్లిస్తున్నారు. వాస్త‌వానికి, అజ్మీర్ ద‌ర్గాను సంద‌ర్భించిన త‌ర్వాత విజ‌య‌వాడ‌కు వెళ్లాల‌ని కేసీఆర్ భావించారు. అయితే, అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ ఆ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. దీంతో, ఆ స్థానంలో రేపు విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌ను ఖ‌రారు చేసుకున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కేసీఆర్...తిరుమ‌ల వెంక‌న్న‌కు మొక్కు చెల్లించుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే, విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ...ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర టీడీపీ నేత‌ల‌ను కేసీఆర్ క‌లిసే విష‌యంపై ఎటువంటి అధికారిక స‌మాచారం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు