పెద్దాయన పై కవిత అలక

పెద్దాయన పై కవిత అలక

తెలంగాణలో అధికార ప‌క్ష‌మైన టీఆర్ఎస్ పార్టీలో క‌ల‌క‌లం చోటుచేసుకుంది. ఏకంగా ఇది ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఇలాకాలోనే కావ‌డం గ‌మ‌నార్హం. పార్టీలో ఒక‌రకంగా తిరుగుబాటు వంటి వాతావ‌ర‌ణం చోటుచేసుకోగా...స‌ద‌రు ప‌రిణామానికి కార‌ణం ఎంపీ, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా హాట్ టాపిక్‌గా మారింది మ‌రెవ‌రో కాదు...టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్. ఆయ‌న‌పై పార్టీలో నెల‌కొన్న అసంతృప్తి కోట‌లు దాటి ఏకంగా ఫిర్యాదు చేసే వ‌ర‌కు చేరింది. సాక్షాత్తు క‌విత త‌న తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఈ విష‌యంలో మొర‌పెట్టుకోవ‌డం గ‌మనార్హం.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియ‌ర్ నాయ‌కుడు అయిన డీఎస్ త‌న‌కు పార్టీలో గౌర‌వం ద‌క్క‌డం లేద‌ని పేర్కొంటూ టీఆర్ఎస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. చేరిక‌ అనంత‌రం ఆయ‌న‌కు కేబినెట్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టిన కేసీఆర్ ఆ త‌దుప‌రి ఆయ‌న్ను రాజ్య‌స‌భ సభ్యుడిగా ఎంపిక చేశారు. అయితే కొద్దికాలంగా డీఎస్‌ పార్టీతో అంటీముట్ట‌నట్లు ఉంటున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న త‌న‌యుడు అర‌వింద్ బీజ‌పీలో చేరి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీనిపై డీఎస్ త‌న త‌న‌యుడిని వారించ‌లేద‌నే భావ‌న ప‌లువురిలో ఉంది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. తాజాగా ఇదే విష‌యమై స‌మ‌వేశం నిర్వ‌హించి ఆయ‌న‌పై వేటు వేసేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ డీఎస్ తీరుపై ఎంపీ క‌విత మండిప‌డ్డారు.  పార్టీలోకి వస్తానంటే డీఎస్‌ను పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎస్‌ను అవమానపరిస్తే టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా చేసి గౌరవించింది అని పేర్కొన్నారు. కుటుంబ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుంటే డీఎస్ పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వెలిబుచ్చారు. డీఎస్ పరిణామాలు కార్యకర్తల్లో అయోమయానికి గురి చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉండి ఇతర పార్టీలో చేరాలని డీఎస్ చెప్పడం సరికాదన్నారు. కుటుంబాన్ని కంట్రోల్ చేయలేని వ్యక్తి పార్టీలో ఎలా కొనసాగుతారని ఆమె ప్రశ్నించారు. ఒక కుటుంబం గురించి పార్టీ నష్టపోవడం సరికాదని చెప్పారు.  డీఎస్ వ్యవహార శైలిపై సీఎం దృష్టికి తీసుకెళ్లాలని క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్‌ తుల ఉమను కోరామని కవిత తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీని నిలబెట్టిన ఘనత నిజామాబాద్ జిల్లాది అని కవిత తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు