ప‌వ‌న్ జాగ్ర‌త్త‌....జ‌గ‌న్ తో పొత్తు వ‌ద్దు

ప‌వ‌న్ జాగ్ర‌త్త‌....జ‌గ‌న్ తో పొత్తు వ‌ద్దు

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు సమీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కిన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రితో పొత్తు పెట్టుకుంటార‌న్న దానిపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వస్తున్న విష‌యం విదిత‌మే. గ‌త ఎన్నిక‌ల్లో మాదిరి కాకుండా ఈ సారి న‌వ్యాంధ్ర‌లో త్రిముఖ పోరు ఉండ‌బోతోంద‌ని అంతా భావిస్తున్నారు. అయితే, రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీతో ప‌వ‌న్ పొత్తు పెట్టుకుంటార‌ని ర‌క‌ర‌కాల పుకార్లు వినిపిస్తున్నాయి.

అంతేకాదు, వైసీపీతో కలిసేందుకు ప‌వ‌న్ ప్రయత్నిస్తున్నార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో జగన్ కు మ‌ద్ద‌తు తెలిపేందుకు ప‌వ‌న్ సిద్ధపడ్డారని వైసీపీ మాజీ ఎంపీ వ‌ర ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవ‌స‌ర‌మైతే జ‌గ‌న్ కు మ‌ద్ద‌తిచ్చేందుకు కూడా తాను సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ త‌న‌తో అన్నార‌ని వ‌ర‌ప్ర‌సాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ప‌వ‌న్ కూడా బహిరంగంగా ఖండించ‌లేదు. ఈ నేప‌థ్యంలో, ఆ వ్యాఖ్యల‌పై సీపీఐ నేత రామ‌కృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

వైసీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేద‌ని రామ‌కృష్ణ తేల్చి చెప్పేశారు. ఒక‌వేళ పొర‌పాటున వైసీపీతో జ‌న‌సేన చేతులు క‌లిప‌తే....దాంతో జ‌న‌సేన క‌థ ముగిసిన‌ట్లేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దాంతోపాటు వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి రామకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ ధ్యాసంతా సీఎం సీటుపై ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కానీ, జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని రామ‌కృష్ణ జోస్యం చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకున్న జ‌గ‌న్ ......ప్రజా ధనాన్ని దోచేశారని మండిప‌డ్డారు. అటువంటి చ‌రిత్ర ఉన్న జగన్ ను ప్ర‌జ‌లు అంత సులువుగా న‌మ్మ‌ర‌ని చెప్పారు.

2019కి ముందో...త‌ర్వాతో...వైసీపీతో జనసేన పొత్తు ఉంటుంద‌ని వ‌స్తోన్న ఊహాగానాల‌కు రామ‌కృష్ణ వ్యాఖ్య‌లు తెర‌వేసిన‌ట్ల‌యింది. జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తిస్తున్న వామ‌ప‌క్ష పార్టీల‌లో కీల‌క‌మైన నేత అయిన రామ‌కృష్ణ వ్యాఖ్యలు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. వైసీపీతో జ‌న‌సేన పొత్తుపై ప‌వ‌న్ ప్ర‌త్య‌క్షంగా వ్యాఖ్యానించ‌క‌పోయినా....ఆయ‌న త‌ర‌ఫున రామ‌కృష్ణ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటారని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో 2019లో ఏపీలో త్రిముఖ పోరు త‌ప్పేలా లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు