ఆ హీరోయిన్ కు కేటీఆర్ రీట్వీట్...వైర‌ల్!

ఆ హీరోయిన్ కు కేటీఆర్ రీట్వీట్...వైర‌ల్!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువ నేత‌ల్లో కేటీఆర్ కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. అతి సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ 24 గంట‌లూ అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా, ట్విట్ట‌ర్ లో విప‌రీతంగా యాక్టివ్ గా ఉండే కేటీఆర్....నెటిజ‌న్లు ప్ర‌స్తావించే స‌మ‌స్య‌ల‌కు వెంట‌నే స్పందిస్తారు. ఆ ట్వీట్ల‌కు రీట్వీట్ చేయ‌డ‌మే కాకుండా....స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే దిశ‌గా కృషి చేస్తారు. గ‌తంలో కేటీఆర్ ఈ త‌ర‌హాలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించిన సంద‌ర్భాలూ ఉన్నాయి. అదే త‌ర‌హాలో తాజాగా, కేటీఆర్ కు వ‌ర్ధ‌మాన తెలుగు హీరోయిన్ ఇషా రెబ్బా ఓ స‌మ‌స్య‌పై ట్వీట్ చేసింది. దానికి స్పందించిన కేటీఆర్ ....వెంట‌నే రీట్వీట్ చేశారు. త‌న ట్వీట్ కు వెంట‌నే స్పందించిన కేటీఆర్ కు ఇషా ధ‌న్య‌వాదాలు చెప్పింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ల సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

తాజాగా మ‌హారాష్ట్ర‌లో ప్లాస్టిక్ సంచుల వినియోగించిన వారిపై భారీగా ఫైన్ లు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో కూడా ప్లాస్టిక్ సంచులపై నిషేధం విధిస్తే బాగుంటుంద‌ని కేటీఆర్ కు ఇషా ట్వీట్ చేసింది. ‘‘భార‌తదేశంలో ఏయే రాష్ట్రాలు ప్లాస్టిక్ ను బ్యాన్ చేశాయి? ఇప్ప‌టికే చాలా రంగాల్లో అగ్ర‌గామిగా నిలుస్తున్న‌మ‌న తెలంగాణ రాష్ట్రం పేరు ప్లాస్టిక్ నిషేధించిన రాష్ట్రాల‌ జాబితాలో లేక‌పోవ‌డంతో నిరాశ చెందాను. భావిత‌రాల కోసం మ‌న రాష్ట్రం కూడా ప్లాస్టిక్ సంచుల‌పై  నిషేధం విధిస్తే బాగుంటుంది`` అని ఇషా ట్వీట్ చేసింది. ఇషా ట్వీట్ చేసిన గంట‌లోనే కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘‘చ‌ట్ట‌ప్ర‌కారం ప్లాస్టిక్ ను నిషేధించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం ఉండ‌దు. అధికారులకు, ప్ర‌జ‌లకు, ప్లాస్టిక్ తయారీదారుల‌కు ఆ స‌మ‌స్య వ‌ల్ల క‌లిగే ఇబ్బందుల గురించి అవ‌గాహ‌న క‌ల్పించాలి. ముఖ్యంగా స‌మాజంలోని ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా ప్లాస్టిక్ బ్యాగుల వాడ‌కాన్ని నిషేధించేలా ప్ర‌చారం క‌ల్పించాలి. ఇందుకోసం ప్ర‌ణాళికా బ‌ద్ధంగా ముందుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తాం’’ అని కేటీయార్ రీట్వీట్ చేశారు.

త‌న ట్వీట్ కు కేటీఆర్ వెంట‌నే స్పందించ‌డంపై ఇషా సంతోషం వ్య‌క్తం చేస్తూ మ‌రో ట్వీట్ చేసింది. `‘ఇంత త్వ‌ర‌గా స్పందించినంద‌కు ధ‌న్య‌వాదాలు స‌ర్‌. స‌మ‌ర్థ‌మైన‌, ప్ర‌తిభావంత‌మైన మీ లాంటి యువ‌నాయ‌కులు ఉండ‌గా ఇది అసాధ్యం అని నేన‌నుకోవ‌డం లేదు. ప్లాస్టిక్ నిషేధంలో కూడా మ‌న రాష్ట్రాన్ని అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని కోరుకుంటున్నాను. కొత్త‌గా ఏర్ప‌డిన‌ప్ప‌టికీ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంద‌ని గ‌ర్వంగా చెప్పుకునేలా చేయండి’’ అంటూ మ‌రో ట్వీట్ చేసింది. అయితే, ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంపై కేటీఆర్ మ‌రింత పాజిటివ్ గా స్పందించి ఉంటే బాగుంటుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. విధానప‌రంగా కొత్త‌గా ఏదైనా నిర్ణ‌యం తీసుకున్న‌పుడు కొన్ని ఇబ్బందులుంటాయ‌ని, కానీ, వాటిని ఎలాగైనా అధిగ‌మిస్తామ‌ని చెప్పాల్సిన కేటీఆర్ ...ఈ విధంగా ఇబ్బందులుంటాయ‌ని చెప్ప‌డం వ‌ల్ల ప్ర‌జ‌లు నిరుత్సాహ‌ప‌డ‌తారని కామెంట్స్ చేస్తున్నారు. పేకాట క్ల‌బ్ ల పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న త‌ర‌హాలోనే ప్లాస్టిక్ బ్యాగుల నిషేధంపై కూడా వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు