ప‌వ‌న్ త‌ర్వాత‌.. మీ గురించి చెప్పండి ఎంపీ గారు

ప‌వ‌న్ త‌ర్వాత‌.. మీ గురించి చెప్పండి ఎంపీ గారు

*జగన్ కష్టపడడం చూసి పవన్ కళ్యాణ్ వైసిపికి మద్దతిస్తారు* అని ఎంపీ వెల‌గ‌పూడి వరప్రసాద్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ కష్ట‌ప‌డ‌టం ఏంటో మ‌రి. మొన్న‌ మైసూరా రెడ్డి వ్యాఖ్య‌ల‌తో ప్ర‌పంచానికి జ‌గ‌న్ ప‌డుతున్న క‌ష్ట‌మేంటో అర్థ‌మైంది. కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేయ‌డానికి జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తేడా ఏం లేద‌ని సింపుల్‌గా తేల్చేశారాయ‌న‌.

ఇది ప‌క్క‌న పెడితే అస‌లు కొంత కాలంగా పార్ల‌మెంటేరియ‌న్ల‌పై ఈ మ‌ధ్య బాగా చ‌ర్చ జ‌రుగుతోంది. వీళ్లు ఆయా పార్టీల‌కు చెందిన ఎంపీలే గావ‌చ్చు గాని దేశ శాస‌న వ్య‌వ‌స్థ‌లో త‌మ‌కూ భాగ‌స్వామ్యం ద‌క్కేలా చూడ‌మ‌ని ప్ర‌జ‌లు ఓటేసి పార్ల‌మెంటుకు పంపుతారు. ఆ ఓట్ల ఫ‌లితాల త‌ర్వాత ఇక ప్ర‌జ‌ల‌కు ఈ ఎంపీల‌కు లింకు తెగిపోతుంది.

నిజానికి ఎమ్మెల్యే కంటే ఎంపీ వ‌ల్ల ప్ర‌జానీకానికి ఎక్కువ ప్ర‌యోజ‌నం. ఒక విద్యా వంతుడైన ఎంపీ త‌న నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకుని ప్ర‌తి ఇష్యూను పార్ల‌మెంటులో లేవ‌దీసి ఆధార స‌హితంగా ప్ర‌శ్న‌లు వేస్తూ మాట్లాడితే ఐదేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా చేయ‌లేని ఎన్నో ప‌నుల‌ను ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక ఎంపీ చేయ‌గ‌ల‌డు. కేంద్రం నుంచి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను తెప్పించ‌గ‌ల‌డు. అయితే, మునుపు రాజ‌కీయాల్లో విద్యావంతులు త‌క్కువ ఉండేవారు. వారు ప్ర‌జ‌ల సాధార‌ణ‌ స‌మ‌స్య‌లు అర్థం చేసుకునే వారు కీల‌క మైన ఫ్యూచ‌ర్ ప్లానింగ్ మిస్స‌య్యేది. కానీ ఇపుడు ఎంపీలుగా పార్ల‌మెంటుకు వెళ్తున్న‌వారు ఉన్న‌త విద్యావంతులు ఎక్కువ మంది ఉంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువే. కానీ ఎన్నిక‌య్యింది మొద‌లు వారు పార్టీ సేవ చేయ‌డానికే స‌రిపోతుంది. అంత‌కుమించి నియోజ‌క‌వ‌ర్గం వారికి సామాజిక‌ అవ‌గాహ‌నా ఉంచుకోరు. ప్ర‌జ‌ల భ‌విష్య‌త్తు కోస‌మూ కృషి చేయ‌రు.

తాజాగా జ‌గ‌న్ క‌ష్టం గురించి మాట్లాడిన ఎంపీ వ‌ర ప్ర‌సాదునే తీసుకుంటే ఆయ‌న M.Sc., Ph.D. (Biochemistry), M.A. (U.K.) వంటి ఉన్న‌త విదేశీ చ‌దువులు చ‌దివారు. కానీ ఫ‌లితం శూన్యం. ప్ర‌పంచం తిరిగి అలాంటి ప‌రిస్థితులు త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉండాల‌ని త‌ల‌చ‌లేదు. పార్ల‌మెంటులో పోరాడ‌నూ లేదు. పైగా ఈయ‌న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా. ఆయ‌న  ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. ఒక్క సమస్యా లేవనెత్తలేదు. ఒక్క ప్రశ్నా వేయలేదు. కానీ హాజ‌రు మాత్రం 82 శాతం ఉంది. ఇలాంటి ఉన్న‌త విద్యావంతులు, సీనియ‌ర్ అధికారి అయినా కూడా పార్ల‌మెంటులో ప్ర‌శ్నించ‌క‌పోతే ఇక ఎంపీలుగా వెళ్లిన‌ వ్యాపారులు, సాధార‌ణ రాజ‌కీయ నేత‌ల గురించి ఇక ఏం ఆలోచించ‌గ‌లం? బుర్ర‌లో ఎంతో గుజ్జు ఉండి దానిని కేవ‌లం త‌మ అధ్య‌క్షుడి జ‌పం చేయ‌డానికి మాత్ర‌మే వాడితే ప్ర‌జ‌లు ఏమైపోవాలి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు