జ‌గ‌న్ ఎంపీలు రాజీనామా త‌ర్వాత ఉప ఎన్నిక‌లు ఎందుకు రావు?

జ‌గ‌న్ ఎంపీలు రాజీనామా త‌ర్వాత ఉప ఎన్నిక‌లు ఎందుకు రావు?

ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్రం అనుస‌రిస్తున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఐదుగురు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లుగా చెప్పి మ‌రీ చేయ‌టం తెలిసిందే. అయితే.. ఎంపీలు త‌మ రాజీనామాల్ని ఫార్మాట్ ప్ర‌కారం చేసినా.. వాటిని ఆమోదించే విష‌యంలో లోక్ స‌భ స్పీక‌ర్ అనుస‌రించిన వైఖ‌రిపై ప‌లువురు త‌ప్పుప‌డుతున్నారు. ఉప ఎన్నిక‌ల‌కు వీలు లేకుండా చేసేలా లోక్ స‌భ స్పీక‌ర్ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. దీనికి త‌గ్గ‌ట్లే.. రాజ్యాంగంలోని సెక్ష‌న్ 151(ఏ) ఉంద‌న్న మాటను ప్ర‌స్తావిస్తున్నారు. అప్పుడెప్పుడో జ‌గ‌న్ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తే.. గురువారం వాటిని ఆమోదిస్తూ లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే వెంట‌నే ఆమోదించిన స్పీక‌ర్.. జ‌గ‌న్ పార్టీ ఎంపీల రాజీనామాల్ని మాత్రం ఆమోదించ‌కుండా పెండింగ్ ఉంచారు. ఎట్ట‌కేల‌కు గురువారం వారి రాజీనామాల్ని ఆమోదించారు.

తాజాగా స్పీక‌ర్ ఆమోదం పొందిన ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు చేసిన త్యాగాల‌తో వారి విలువైన ఏడాది ప‌ద‌వీ కాలం పోనుంది. అదే స‌మ‌యంలో.. వారి రాజీనామాల ఆమోదంతో ఖాళీ అయిన లోక్ స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు.

నిపుణుల వాద‌న ప్ర‌కారం ప్ర‌జా ప్రాతినిధ్యం చ‌ట్టం 1951లోని 151 (ఏ) సెక్ష‌న్ ప్ర‌కారం ఎంపీల ప‌ద‌వీకాలం మ‌రో ఏడాది మాత్ర‌మే మిగిలి ఉంటే ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కూడ‌దు. ఏ అసెంబ్లీ.. లోక్ స‌భ స్థాన‌మైనా ఖాళీ అయిన ఆర్నెల్ల లోపు ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న దానికి ఇది మిన‌హాయింపుగా చెబుతారు. ఈ నిబంధ‌న ఎన్నిక‌లు జ‌రిగే ఏడాది ముందు నుంచే అమ‌ల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఈ వాద‌న‌ను ఈసీ వ‌ర్గాలు సైతం ధ్రువీక‌రించాయి. గ‌తంలో లోక్ స‌భ చివ‌రి ఏడాదిలో ఖాళీ అయిన స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల్ని నిర్వ‌హించింది లేదు. తాజాగా అదే తీరు అమ‌ల‌వుతుంద‌ని చెబుతున్నారు. జూన్ 5 త‌ర్వాత ఖాళీ అయిన ఏ లోక్ స‌భ సీటుకు ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశం లేన‌ట్లేన‌ని చెబుతున్నారు. ఎంపీల రాజీనామాలు బుధ‌వారం నుంచి అమ‌ల్లోకి రావ‌టంతో ఈ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌వ‌ని చెబుతున్నారు. దీంతో.. జ‌గ‌న్ ఎంపీలు ఐదుగురు చేసిన త్యాగాల‌కు ఫ‌లితం లేకుండా పోయింది. ఒక‌వేళ ఉప ఎన్నిక‌లు జ‌రిగితే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా మీద ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష ఏమిటో కేంద్రానికి స్ప‌ష్ట‌మ‌య్యే వీలుంది. ఈ అపాయాన్ని అడ్డుకోవ‌టానికే రాజీనామా ఆమోదం విష‌యంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌హ‌రించిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు