కాంగ్రెస్ బ‌త‌కాలంటే... జ‌గ‌న్‌ను తిట్టాలా!

కాంగ్రెస్ బ‌త‌కాలంటే... జ‌గ‌న్‌ను తిట్టాలా!

ఇక సీఎం కుర్చీ నాదే... అని జ‌గ‌న్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. కానీ... నాలుగేళ్ల కింద‌ట కూడా సేమ్ సీన్ క‌నిపించింది ఏపీలో. కానీ... ఈ మ‌ధ్య‌నే ఉండ‌వ‌ల్లి చేసిన కామెంట్లు వినే ఉంటారుగా మీరు. ఇపుడు ఎన్నిక‌లు వ‌స్తే గెలిచేది జ‌గ‌నే. కానీ ఆ వేవ్‌కు లైఫ్ లేదు. చంద్ర‌బాబు దానిని సులువుగా మార్చ‌గ‌లిగిన నైపుణ్యం, చాణ‌క్యం క‌లిగిన వ్య‌క్తి అని ఆయ‌న వ్యాఖ్యానించారు. నిజ‌మే... చంద్ర‌బాబు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇక ఓడిపోతాడు అనుకున్న ప్ర‌తిసారీ చంద్ర‌బాబు గెలిచాడు. దీనికి సాక్ష్యం చ‌రిత్రే.

ఇక ఇంత‌కీ ఏపీలో జ‌గ‌న్ దేన్ని త‌న బ‌లంగా ఫీల‌వుతున్నారంటే... వైసీపీ వ‌ద్ద సమాధానం లేదు. వైసీపీ సోష‌ల్ మీడియా టీం ప్ర‌చారం చూసినా, ఆ పార్టీ నేత‌ల ఆరోప‌ణ‌లు, వ్యాఖ్య‌లు విన్నా ఒక విష‌యం స్పష్టంగా అర్థ‌మ‌వుతోంది. వాస్త‌వానికి వైసీపీ ప‌రిస్థితి ఎప్ప‌టిలాగే ఉన్నా... చంద్ర‌బాబు మీద కోపం త‌న‌కు ఓట్లుగా మారుతాయ‌న్న‌ ఒక గుడ్డి విశ్వాస‌మే ఇపుడు జ‌గ‌న్ త‌న‌ బ‌లంగా ఫీల‌వుతున్నాడు.

కానీ ఇటీవ‌ల కాలంలో రెండు ఊహించ‌ని ఆటంకాలు జ‌గ‌న్‌కు ఏర్ప‌డ్డాయి. ఒక‌టి జ‌న‌సేన‌. తాజాగా...రాహుల్‌గాంధీ. జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయో ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు గాని క‌చ్చితంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల్చ‌డంలో మాత్రం ఆ పార్టీ స‌క్సెస్ అవుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌ణ‌. పైగా ముద్ర‌గ‌డ త‌దిత‌రుల సానుభూతి మ‌ద్ద‌తు త‌మ‌కు ఆ సామాజిక వ‌ర్గాన్ని త‌మ చెంత‌న చేరుస్తుంద‌ని జ‌గ‌న్‌ భావించిన త‌రుణంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య‌లో దూరాడు. అయితే, ఇప్ప‌టికీ జ‌న‌సేన ప్ర‌భావం ఉండ‌ద‌ని వైసీపీ గ‌ట్టిగా న‌మ్ముతోంది.

ఇక జ‌గన్ కు త‌గిలిన తాజాషాక్‌... రాహుల్ గాంధీ. ఇటీవ‌ల కాంగ్రెస్ విధానాలు పూర్తిగా మార్చుకుంది. అందుకే ఒక‌ప్ప‌టి సానుకూల రాష్ట్రమైన ఏపీపై క‌న్నేసింది. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్‌ చాందీ, జాతీయ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కె.రాజు, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య‌నేత‌ల బృందంతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ కీల‌క‌ వ్యాఖ్య‌లు చేశారు.  ‘‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేరు.. జగన్‌రెడ్డి వేరు. నిరుపేదల గురించి రాజశేఖరరెడ్డి ఆలోచించేవారు. కానీ జగన్ సెల్ఫిష్‌. స్వ‌లాభ‌మే జ‌గ‌న్ ప‌ర‌మావ‌ధి. కాంగ్రెస్‌ నిరుపేదలకు అండగా ఉంటుంది. జగన్ వ్యాపారుల‌కు అండ‌గా ఉంటారు. అందుకే మ‌నం జ‌గ‌న్‌ను టార్గెట్ చేసుకోవాలి`` ఇప్ప‌టికీ మ‌న‌ది బ‌ల‌మైన ఓటు బ్యాంకు అంటూ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు.  వైసీపీలో ఉన్న బలమైన నేతలంతా కాంగ్రెస్‌ భావజాలం కలిగినవారే కాబ‌ట్టి వారిని తిరిగి మన గూటికి ఆహ్వానించండి అంటూ హిత‌బోధ చేశారు.

దీన్ని బ‌ట్టి చూస్తే స్త‌బ్దుగా ఉన్న ప్ర‌గాఢ సానుభూతి ప‌రుల‌కు కాంగ్రెస్ నుంచి కీల‌క సందేశాలు అందిన‌ట్టే. ఈ ప్ర‌య‌త్నాలు కాంగ్రెస్‌కు ఈసారి అధికారం తెచ్చిపెట్ట‌క‌పోయినా పార్టీని పున‌ర్మించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మోడీ వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో కొంద‌రు నేత‌లను జాతీయ స్థాయి ప్ర‌యోజ‌నాలు చూపి పార్టీలోకి ఆహ్వానించే అవ‌కాశ‌మూ క‌నిపిస్తోంది. సాధార‌ణంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు టీడీపీకి ఓటు వేయ‌రు. కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యం అయిపోవ‌డం వ‌ల్ల వైసీపీ వారికి ఒక ఆప్ష‌న్‌లా క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తే ఒక 10-15 శాతం ఓట్లు సాధించ‌గ‌ల‌మన్న ఆశ‌లు కాంగ్రెస్‌కు ఉన్నాయి. ఇది ఇది జ‌గ‌న్ ఓటు బ్యాంకుకు భారీ దెబ్బ‌. కాంగ్రెస్ ఈ ఓట్ల‌తో సాధించేమీ లేక‌పోయినా జ‌గ‌న్ కు మాత్రం భారీగా న‌ష్టం చేసే అవ‌కాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు